Stock Market: 8 రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
Stock Market: సెన్సెక్స్ 161.41, నిఫ్టీ 57.80 పాయింట్లు లాస్
Stock Market: 8 రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 161.41 పాయింట్ల నష్టంతో 61 వేల 193 దగ్గర స్థిరపడగా.. నిఫ్టీ 57.80 పాయింట్లు నష్టపోయి 18 వేల 089 దగ్గర ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీసీ, నెస్లే ఇండియా, కొటాక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, రిలయన్స్, ఎస్‌బీఐ, విప్రో షేర్లు నష్టపోయాయి.