SBI: వ్యాపారులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. ఈ ఖాతా వారికోసమే..

ఎస్బీఐ వ్యాపారులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. SBI గోల్డ్ కరెంట్ ఖాతాను ఓపెన్ చేయడానికి అనుమతినిచ్చింది.

Update: 2021-12-13 10:30 GMT

వ్యాపారులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. ఈ ఖాతా వారికోసమే..(ఫైల్-ఫోటో)

SBI Current Account Benefits: ఎస్బీఐ వ్యాపారులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. SBI గోల్డ్ కరెంట్ ఖాతాను ఓపెన్ చేయడానికి అనుమతినిచ్చింది. ఇప్పటికే వ్యాపారంలో స్థిరపడినవారు, కొత్తగా బిజినెస్‌ స్టార్ట్ చేస్తున్నవారు ఈ ఖాతా ఓపెన్‌ చేయడానికి అర్హులు. SBI గోల్డ్ కరెంట్ ఖాతా ప్రత్యేకత ఏమిటంటే ఇది వినియోగదారులకు అనేక ప్రయోజనాలను కల్పిస్తుంది. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ చేస్తూ SBI గోల్డ్ కరెంట్ ఖాతా ప్రయోజనాల గురించి సమాచారాన్ని తెలియజేసింది SBI ప్రకారం పెద్దమొత్తంలో నగదు లావాదేవీలు నిర్వహించే వ్యాపారవేత్తలు, నిపుణులు, దుకాణదారులకు గోల్డ్ కరెంట్ ఖాతా అనువైనది.

ఇది వారి కార్యకలాపాలను విస్తరించడానికి సహాయపడుతుంది. ఇందులో బ్యాంకు అదనపు సేవలన్నీ తగ్గింపు ధరలకు లభిస్తాయి. తద్వారా లావాదేవీ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. వ్యాపారులకు లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

మీరు ఈ అకౌంట్‌ ఓపెన్‌ చేయడం చాలా సులభం. వివరాల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా బ్రాంచ్‌ని సందర్శించండి.

SBI గోల్డ్ కరెంట్ ఖాతా ప్రయోజనాలు

1. నెలవారీ సగటు బ్యాలెన్స్ - రూ.1,00,000

2. నెలకు రూ. 25,00,000 వరకు ఉచిత నగదు డిపాజిట్

3. నెలకు 300 మల్టీసిటీ చెక్ బుక్

4. హోమ్ బ్రాంచ్ నుంచి ఉచిత నగదు ఉపసంహరణ

5. 22000 SBI బ్యాంక్ శాఖల నుంచి నగదు ఉపసంహరణ డిపాజిట్ సౌకర్యం

Tags:    

Similar News