కేంద్రం మరో కొత్త పథకం.. ఈ కులాల వారికి సులభంగా లక్ష రూపాయలు..!

Vishwakarma Yojana:ఎన్నికలకి ముందు కేంద్రం మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది.

Update: 2023-08-18 16:00 GMT

కేంద్రం మరో కొత్త పథకం.. ఈ కులాల వారికి సులభంగా లక్ష రూపాయలు..!

Vishwakarma Yojana: ఎన్నికలకి ముందు కేంద్రం మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దీని గురించి ప్రస్తావించారు. వెనుకబడిన చేతి వృత్తులవారిని బలోపేతం చేయడానికి ఈ పథకాన్ని రూపొందించారు. దీని కింద సులభంగా రుణాలని మంజూరు చేస్తారు. ఈ పథకం పేరు విశ్వకర్మ యోజన. దీని ప్రయోజనం దేశంలోని వెనుకబడిన వర్గాలకి అందుతుంది. ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు తదితర విషయాలు తెలుసుకుందాం.

విశ్వకర్మ పథకం

'విశ్వకర్మ యోజన'ని వచ్చే నెలలో ప్రారంభిస్తామని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వచ్చే నెలలో వచ్చే విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పథకం గురించిన సమాచారం ఇస్తూ సంప్రదాయ నైపుణ్యాలు కలిగిన వారి కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభిస్తోందని తెలిపారు. ఇందులోభాగంగా రూ.13 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ పథకం అమలులోకి వస్తుంది. కేంద్ర మంత్రివర్గం రూ.13,000 కోట్లకి ఆమోదం తెలిపింది. ఇది నేత కార్మికులు, స్వర్ణకారులు, కమ్మరులు, లాండ్రీ కార్మికులు, బార్బర్‌లతో సహా దాదాపు 30 లక్షల మంది సంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులకు ప్రయోజనం లభిస్తుంది. ఈ పథకం కింద రూ.లక్ష వరకు రుణాలు సులభమైన నిబంధనలపై అందిస్తారు. సంప్రదాయ నైపుణ్యాలు కలిగిన వారిని ఆదుకునేందుకు 'పీఎం విశ్వకర్మ' పథకానికి ప్రధాని ఆమోదం తెలిపారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Tags:    

Similar News