చౌక రుణాలు కావాలా.. 150నగరాల్లో ఎక్స్ పో నిర్వహించనున్న ప్రముఖ బ్యాంక్

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అడానీ ఇటీవల వివాహం చేసుకున్నారు

Update: 2025-02-08 09:10 GMT

చౌక రుణాలు కావాలా.. 150నగరాల్లో ఎక్స్ పో నిర్వహించనున్న ఎక్స్ పో 

Loan : రిజర్వ్ బ్యాంకు మధ్య తరగతి ప్రజలకు పెద్ద రిలీఫ్ ఇస్తూ వడ్డీ రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వారికి చాలా ఉపశమనాన్ని కలిగించాయి. ముఖ్యంగా EMIలు కట్టే వారికి కొత్త లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్న వారికి చాలా ఉపయోగకరం. 

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోన్ ఎక్స్‌పో

దేశంలోని రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 150 నగరాల్లో తక్షణ లోన్స్ అందించేందుకు లోన్ ఎక్స్‌పో నిర్వహిస్తోంది. ఈ ఎక్స్‌పో ద్వారా హౌసింగ్ లోన్, కార్ లోన్, ఇతర లోన్లు అన్ని తక్షణం సాధారణ వడ్డీ రేట్లతో అందుబాటులో ఉంటాయి.

ఎక్స్‌పో ఎలా ఉంటుంది?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు "PNB Home Loan Expo 2025" పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ ఎక్స్‌పోలో రాయితీ వడ్డీ రేట్లతో రుణాలు పొందవచ్చు. అలాగే సాంకేతికంగా "ఆన్-స్పాట్" లోన్ల అప్రూవల్ లెటర్, సాంక్షన్ లెటర్ కూడా తీసుకోవచ్చు. ఈ ఎక్స్‌పో 7 ఫిబ్రవరి నుండి ప్రారంభమైంది. ప్రస్తుతం 150 నగరాల్లో జరుగుతుంది. ఈ రెండు రోజుల ఎక్స్‌పోలో కొత్త ఇళ్లు కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు చాలా తక్కువ రేట్లలో గృహ రుణాలు పొందవచ్చు.

వడ్డీ రేట్లు

పంజాబ్ నేషనల్ బ్యాంకు సీనియర్ అధికారులు చెప్పిన ప్రకారం  ఈ ఎక్స్‌పోలో గృహ రుణం తీసుకునే వారికి 8.4% వార్షిక వడ్డీ రేటుతో రుణం అందిస్తుంది. అలాగే, కార్ లోన్ కోసం వడ్డీ రేటు 8.75% నుండి ప్రారంభమవుతుంది. మరోవైపు, పీఎం సూర్య ఘర్ యోజన కింద సౌర ప్లాంట్ కోసం రుణం తీసుకునే వారికి 7% వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా అందిస్తున్న ఈ సస్తా లోన్ ఎక్స్‌పో, గృహ రుణాల మీద భారం తగ్గించుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తుంది.

Tags:    

Similar News