PhonePe: ఫోన్‌పే యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్: ఇక పిన్ నంబర్ అవసరం లేదు..!
PhonePe: డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోన్‌పే తన వినియోగదారుల కోసం ఒక సంచలన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
PhonePe: ఫోన్‌పే యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్: ఇక పిన్ నంబర్ అవసరం లేదు..!
PhonePe: డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోన్‌పే తన వినియోగదారుల కోసం ఒక సంచలన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై చిన్న చిన్న లావాదేవీల కోసం పదే పదే యూపీఐ (UPI) పిన్ ఎంటర్ చేయాల్సిన తలనొప్పి ఉండదు. స్మార్ట్‌ఫోన్ అన్‌లాక్ చేసినంత ఈజీగా, కేవలం మీ ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ ఐడీతో చెల్లింపులు పూర్తి చేయవచ్చు.
సాధారణంగా మనం ఏ చిన్న వస్తువు కొన్నా పిన్ నంబర్ టైప్ చేయాల్సిందే. కానీ ఫోన్‌పే ప్రవేశపెట్టిన ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫీచర్‌తో రూ. 5,000 వరకు చేసే లావాదేవీలకు పిన్ అవసరం లేదు. మీ ఫోన్ బయోమెట్రిక్ సెన్సార్‌ను తాకితే చాలు, సెకన్ల వ్యవధిలో పేమెంట్ సక్సెస్ అవుతుంది. అయితే, భద్రత దృష్ట్యా రూ. 5,000 దాటిన లావాదేవీలకు మాత్రం ఎప్పటిలాగే పిన్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
రద్దీగా ఉండే సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల్లో లైన్‌లో ఉన్నప్పుడు పిన్ టైప్ చేసే సమయం ఆదా అవుతుంది. పక్కన ఉన్న వారు మీ పిన్ నంబర్‌ను చూస్తారనే భయం ఇక ఉండదు. మీ వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు ఉంటేనే లావాదేవీ జరుగుతుంది కాబట్టి ఇది అత్యంత సురక్షితం.యూజర్లకు అత్యంత సులభమైన, వేగవంతమైన చెల్లింపు అనుభవాన్ని అందించడమే ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశ్యం.
యాక్టివేట్ చేసుకోవడం ఎలా?
ఈ కొత్త ఫీచర్‌ను ఆక్టివేట్ చేసుకోవడం చాలా సులభం.ఫోన్‌పే యాప్‌లో మీ ప్రొఫైల్ సెక్షన్‌కు వెళ్లండి.అక్కడ Manage Payments ఆప్షన్‌ను క్లిక్ చేయండి. Biometric Pay ఆప్షన్‌ను ఎంచుకుని, మీ బ్యాంక్ అకౌంట్‌ను ఎనేబుల్ చేయండి.మీ యూపీఐ పిన్ ,బయోమెట్రిక్‌తో వన్-టైమ్ సెటప్‌ను పూర్తి చేస్తే సరి!
ప్రస్తుతానికి ఈ సౌకర్యం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రాగా, త్వరలోనే ఐఓఎస్ వినియోగదారులకు కూడా అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. డిజిటల్ పేమెంట్స్ ప్రపంచంలో ఈ వన్-టచ్ విప్లవం యూజర్లకు నిజంగానే పెద్ద ఊరట అని చెప్పవచ్చు.