Petrol Price Today 22.10.2019: స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు.. డీజిల్ ధరలూ తగ్గాయి!

ఆరు రోజులు నిలకడగా ఉన్న పెట్రోల్ ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. 22.10.2019 మంగళవారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 6 పైసలూ తగ్గింది.

Update: 2019-10-22 02:52 GMT

ఆరు రోజులు నిలకడగా ఉన్న పెట్రోల్ ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి.  22.10.2019 మంగళవారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 6 పైసలూ తగ్గింది.  దీంతో పెట్రోల్ ధర 77.86 రూపాయలకు తగ్గింది.  డీజిల్ ధర  లీటరుకు 6 పైసలు తగ్గడంతో 72.09 రూపాయలకు చేరింది. ఇక అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 7 పైసలూ తగ్గింది.  దీంతో పెట్రోల్‌ ధర 77.47 రూపాయలు గా ఉంది.  ఇక  డీజిల్ ధర 71.38 రూపాయలకు తగ్గింది.  ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర 6 పైసలు, డీజిల్ ధర 6 పైసలూ తగ్గిడంతో  పెట్రోల్ ధర లీటరుకు 77.10, డీజిల్ ధర లీటరుకు 71.04 రూపాయలకు తగ్గాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా లీటరు పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 6 పైసలూ తగ్గింది.  దీంతో అక్కడ పెట్రోల్ ధర 73.22 రూపాయలు ఉండగా, డీజిల్ ధర  లీటరుకు 66.11 రూపాయలుగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ ధర 78.83 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 69.29 రూపాయలుగానూ నిలిచాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.


Tags:    

Similar News