Railway Tickets on EMI: ఇక నుంచి EMIలో రైల్వే టికెట్లు.. ఐఆర్‌సీటీసీ కొత్త నిర్ణయం
Railway Tickets on EMI: ఈ మధ్య ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్లు ఇస్తోంది. తాజాగా ఈ కామర్స్ సైట్లలో వస్తువులను ఈఎమ్‌ఐలో కొనుగోలు చేసినట్టు ఇక రైలు టికెట్లనూ కొనుక్కోవచ్చు.
Railway Tickets on EMI: ఇక నుంచి EMIలో రైల్వే టికెట్లు.. ఐఆర్‌సీటీసీ కొత్త నిర్ణయం
Railway Tickets on EMI: ఈ మధ్య ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్లు ఇస్తోంది. తాజాగా ఈ కామర్స్ సైట్లలో వస్తువులను ఈఎమ్‌ఐలో కొనుగోలు చేసినట్టు ఇక రైలు టికెట్లనూ కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఊరు వెళ్లాలి. కానీ చేతిలో డబ్బులు ఉండవు. అప్పుడు ఎవరో ఒకరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని ఊరి వెళ్లి వస్తూ ఉంటారు. ఇలా కాకుండా ఎవరినీ అడగకుండా ఈఎమ్‌ఐలో రైల్వే టికెట్లు కొనుగోలు చేసే విధంగా ఐఆర్‌సిటీసి( ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ఒక గొప్ప సదుపాయాన్ని తీసుకొచ్చింది.
సాధారణంగా ఈ కామర్స్ సైట్లలో వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువగా ఈఎమ్ఐలు పెట్టుకుంటాం. అయితే ఇందులో డిస్కౌంట్లు వస్తాయి. అదేవిధంగా డబ్బులు ఉన్నప్పుడు కొంత కొంత కట్టుకోవచ్చు. దీనివల్ల ఆర్ధిక భారం ఎక్కువగా పడదు. ఇప్పుడు ఇలాంటి ఫెసిలిటీని రైల్వే సంస్థ ప్రయాణికుల కోసం తీసుకొచ్చింది. మీరు ట్రైన్ టికెట్లు కొనుగోలు చేసుకోవాలంటే ఐఆర్‌సిటీసీ రైల్ కనెక్ట్ యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
ఈఎంఐ ట్రైన్ టికెట్ సేవలను ఐఆర్‌సిటీసీ క్యాష్ఈ ( CASHe) సంస్థతో కలిసి నిర్వహిస్తోంది. ఇప్పుడు ప్రయాణించండి. తర్వాత చెల్లించండి అనే ఆప్షన్ ద్వారా ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకుని వాయిదా పద్దతిలో డబ్బులను చెల్లించవచ్చు. సాధారణ, తాత్కాల్ టికెట్ బుకింగ్ కోసమూ ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. డబ్బును 6 లేదా 8 నెలల్లో చెల్లించవచ్చు. అయితే టికెట్ బుకింగ్ సమయంలో కొంత డబ్బుచెల్లించాల్సి ఉంటుంది. మిగిలినది ఈఎమ్‌ఐగా మార్చుకోవచ్చు. అయితే కాలవ్యవధిని బట్టి వడ్డీ రేటు ఉంటుంది.
అన్ని రైళ్లకూ ఈ ఆఫ్షన్ వర్తిస్తుందా?
ఈఎమ్‌ఐ ఆప్షన్ అన్ని రైళ్లకు వర్తించదు. కేవలం భారత్ గౌరవ రైలుకు మాత్రమే వర్తిస్తుంది. దేశంలోని ప్రసిద్ది పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి రైల్వే శాఖ ఈ రైళ్లను ప్రారంభించింది. ఇందులో ఎకానమీ, థర్డ్ ఏసీ, కంఫర్ట్ క్యాటగిరీ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వాటిని ఈఎమ్‌ఐ పద్దతిలో కొనుగోలు చేసుకోవచ్చు. కాబట్టి రైల్వేలు ఈఎమ్‌ఐ ఆప్షన్‌ని తీసుకొచ్చింది.