ATM Notes: ఇకపై ఏటీఎంలలో 10,20,50 రూపాయల నోట్లు

ATM Notes: డిజిటల్ విప్లవం పుణ్యమా అని ఈ రోజుల్లో జేబులో రూపాయి లేకపోయినా మొబైల్‌తో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాం. కానీ, కొన్నిసార్లు అదే మొబైల్ సిగ్నల్ లేకపోయినా లేదా చిన్న చిన్న అవసరాల కోసం చిల్లర దొరకకపోయినా పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు.

Update: 2026-01-28 17:14 GMT

ATM Notes: డిజిటల్ విప్లవం పుణ్యమా అని ఈ రోజుల్లో జేబులో రూపాయి లేకపోయినా మొబైల్‌తో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాం. కానీ, కొన్నిసార్లు అదే మొబైల్ సిగ్నల్ లేకపోయినా లేదా చిన్న చిన్న అవసరాల కోసం చిల్లర దొరకకపోయినా పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. బస్సులో చిల్లర లేదని కండక్టర్ విసుక్కోవడం, టీ కొట్టు దగ్గర పది రూపాయల నోటు కోసం వెతుక్కోవడం మనందరికీ అనుభవమే. ఈ చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు భారత ప్రభుత్వం ఒక అదిరిపోయే ప్లాన్ సిద్ధం చేసింది.

ఇకపై ఏటీఎంల నుంచి కేవలం పెద్ద నోట్లే కాదు.. రూ. 10, రూ. 20 నోట్లు కూడా వస్తాయట. సాధారణంగా ఏటీఎంకి వెళ్తే రూ. 100 లేదా రూ. 500 నోట్లు వస్తాయి. కానీ, సామాన్యుడి అవసరాలను గుర్తించిన ప్రభుత్వం, ఇకపై చిన్న కరెన్సీ నోట్లను కూడా ఏటీఎంల ద్వారా అందించాలని నిర్ణయించింది. రూ. 10, రూ. 20, రూ. 50 నోట్లు కూడా సులభంగా పొందేలా ఏటీఎంలను రీడిజైన్ చేయబోతున్నారు.

ఈ వినూత్న ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటికే ప్రయోగాత్మకగా ముంబైలో ప్రారంభించింది. అక్కడ చిన్న కరెన్సీ నోట్ల లభ్యతను పెంచేందుకు ప్రత్యేక ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే, త్వరలోనే మీ ఊరిలో కూడా చిన్న నోట్ల ఏటీఎంలు దర్శనమిస్తాయి.

రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, మార్కెట్లు, ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర చిల్లర సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఈ కొత్త ఏటీఎంలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

చిన్న నోట్లే కాదు.. మీ దగ్గర ఉన్న రూ. 500 నోటు ఇచ్చి చిల్లర తీసుకునేలా 'కరెన్సీ ఎక్స్ఛేంజ్ మిషన్ల'ను కూడా ప్రభుత్వం తీసుకురానుంది. ఇది ముఖ్యంగా వీధి వ్యాపారులు, రోజువారీ కూలీలు , ప్రయాణికులకు ఒక వరంలా మారనుంది.

Tags:    

Similar News