FASTag New Rules: ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 1 నుండి ఆ వెరిఫికేషన్ అవసరం లేదు.. NHAI కీలక నిర్ణయం!

FASTag New Rules: ఫాస్టాగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఫిబ్రవరి 1 నుండి KYV (Know Your Vehicle) వెరిఫికేషన్ ప్రక్రియను NHAI నిలిపివేస్తోంది. కొత్త నిబంధనలు, ప్రయోజనాలు మరియు బ్యాంకుల బాధ్యతలపై పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Update: 2026-01-28 07:33 GMT

FASTag New Rules: ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 1 నుండి ఆ వెరిఫికేషన్ అవసరం లేదు.. NHAI కీలక నిర్ణయం!

FASTag New Rules: దేశవ్యాప్తంగా హైవేలపై ప్రయాణించే వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తీపి కబురు అందించింది. ఫాస్టాగ్ జారీ మరియు యాక్టివేషన్ ప్రక్రియలో ఉన్న సంక్లిష్టతలను తొలగిస్తూ 'నో యువర్ వెహికల్' (KYV) విధానాన్ని ఉపసంహరించుకుంది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి.

ఏమిటీ మార్పు? ఎవరికి లాభం? ఇప్పటివరకు కొత్త ఫాస్టాగ్ తీసుకున్న తర్వాత లేదా వాడుతున్న సమయంలో వాహన ధృవీకరణ కోసం KYV ప్రక్రియ తప్పనిసరిగా ఉండేది. దీనివల్ల పత్రాలు సరిగ్గా ఉన్నా, పదే పదే ఫోటోలు అప్‌లోడ్ చేయడం, బ్యాంకుల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు ఎదురయ్యేవి.

♦ కొత్త ట్యాగ్‌లకు: ఫిబ్రవరి 1 తర్వాత కార్లు, జీపులు, వ్యాన్‌లకు తీసుకునే కొత్త ఫాస్టాగ్‌లకు ఇకపై KYV వెరిఫికేషన్ అవసరం లేదు.

♦ పాత ట్యాగ్‌లకు: ఇప్పటికే ఫాస్టాగ్ వాడుతున్న వారు కూడా ఎటువంటి కంప్లైంట్లు లేనట్లయితే రొటీన్ KYV చేయించుకోవాల్సిన అవసరం లేదు.

బ్యాంకులకే పూర్తి బాధ్యత: ఇకపై ఫాస్టాగ్ యాక్టివేట్ చేయడానికి ముందే వాహన వివరాలను ధృవీకరించే బాధ్యతను NHAI పూర్తిగా బ్యాంకులకు అప్పగించింది.

♦ వాహన్ (VAHAN) డేటాబేస్: బ్యాంకులు ట్యాగ్ జారీ చేసే ముందే ప్రభుత్వ 'వాహన్' డేటాబేస్ ద్వారా వివరాలను సరిచూస్తాయి.

♦ ప్రీ-యాక్టివేషన్: వివరాలు సరిగ్గా ఉంటేనే ట్యాగ్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల ట్యాగ్ యాక్టివేట్ అయిన తర్వాత వినియోగదారుడికి ఎటువంటి అదనపు పని ఉండదు.

ఎప్పుడు KYV అవసరమవుతుంది? సాధారణ పరిస్థితుల్లో అవసరం లేకపోయినా, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అధికారులు మళ్లీ వెరిఫికేషన్ అడిగే అవకాశం ఉంది:

♦ ఫాస్టాగ్ దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదు వస్తే.

♦ తప్పుడు వాహనానికి ట్యాగ్ లింక్ చేసినట్లు గుర్తిస్తే.

♦ ట్యాగ్ సరిగ్గా అతికించకుండా (Loose Tag) వాడుతున్నట్లు తెలిస్తే.

Tags:    

Similar News