iPhone 16: ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్..ఫ్లిప్‌కార్ట్‌లో ఎంతంటే?

iPhone 16: ఆపిల్ ఐఫోన్ ప్రేమికులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. కొత్తగా ఐఫోన్ 16 కొనాలని ప్లాన్ చేస్తున్నారా?

Update: 2026-01-29 05:46 GMT

iPhone 16: ఆపిల్ ఐఫోన్ ప్రేమికులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. కొత్తగా ఐఫోన్ 16 కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే అస్సలు ఆలస్యం చేయకండి. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 16పై కనీవినీ ఎరుగని భారీ డీల్‌ను అందిస్తోంది. రూ. 80 వేల బడ్జెట్ అనుకున్న వారు ఇప్పుడు కేవలం రూ. 65 వేల లోపే ఈ లేటెస్ట్ మోడల్‌ను సొంతం చేసుకునే సువర్ణ అవకాశం వచ్చింది.

ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్ అయినప్పుడు దీని ప్రారంభ ధర రూ. 79,900 గా ఉండేది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ప్రత్యేక డిస్కౌంట్‌తో ఇది ఏకంగా రూ. 15,000 తగ్గి రూ. 64,900 కి అందుబాటులోకి వచ్చింది. ఇంతటితో అయిపోలేదు, మీ దగ్గర ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దీనివల్ల మరో రూ. 4,000 వరకు ధర తగ్గే అవకాశం ఉంది. అంటే దాదాపు రూ. 60 వేల దరిదాపుల్లోనే ఈ ప్రీమియం ఫోన్ మీ చేతికి వస్తుంది.

మీ వద్ద ఉన్న పాత స్మార్ట్‌ఫోన్ కండిషన్ బాగుంటే, దానిని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 53,500 వరకు బోనస్ పొందే వీలుంది. ఒకేసారి అంత డబ్బు చెల్లించలేని వారి కోసం నెలకు కేవలం రూ. 5,409 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది సామాన్యులకు కూడా ఐఫోన్ కలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.

ఈ ఐఫోన్ మోడల్ కేవలం ధర విషయంలోనే కాదు, ఫీచర్ల పరంగా కూడా అగ్రస్థానంలో ఉంది. ఇందులో అమర్చిన లేటెస్ట్ ఏ18 బయోనిక్ చిప్‌సెట్ , 8జీబీ ర్యామ్ మీకు అత్యంత వేగవంతమైన పనితీరును అందిస్తాయి. గేమింగ్ ఆడినా లేదా భారీ యాప్స్ వాడినా ఈ ఫోన్ ఎక్కడా తడబడదు. దీనిలోని 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కళ్ళకు విందు చేసే కలర్స్ , అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది.

ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లకు ఐఫోన్ 16 ఒక వరం లాంటిది. ఇందులో ఉన్న 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్‌తో ప్రొఫెషనల్ క్వాలిటీ ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక 3,561 ఎంఏహెచ్ బ్యాటరీ రోజంతా మీకు తోడుగా ఉంటుంది. లేటెస్ట్ ఐఓఎస్ అనుభూతిని పొందుతూ, స్టైలిష్ లుక్‌తో మెరిసిపోవాలనుకునే వారికి ఐఫోన్ 16 సరైన ఎంపిక. స్టాక్ ముగిసేలోపే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్‌ను వెంటనే లాక్ చేసుకోండి.

Tags:    

Similar News