Gold Price Crash: బంగారం ధరలకు భారీ ముప్పు? ‘గోల్డ్ బబుల్’ పేలితే కొనుగోలుదారుల పరిస్థితి ఏంటి?

Gold Price Crash Alert: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు త్వరలోనే భారీగా కుప్పకూలే ప్రమాదం ఉందని (Gold Price Collapse) అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Update: 2026-01-29 10:27 GMT

Gold Price Crash Alert: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు త్వరలోనే భారీగా కుప్పకూలే ప్రమాదం ఉందని (Gold Price Collapse) అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది కాలంలోనే బంగారం ధర సుమారు 60 శాతం పెరగడం సహజమైన పరిణామం కాదని, ఇది ఒక కృత్రిమమైన ‘గోల్డ్ బబుల్’ (Gold Bubble) అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ సంస్థల ‘రిపోర్ట్’ మాయాజాలం?

ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు సామాన్యులను ఆకర్షించడానికి కొన్ని దిగ్గజ ఆర్థిక సంస్థలు ‘ధరలు ఇంకా పెరుగుతాయి’ అంటూ నివేదికలు విడుదల చేస్తుంటాయి. గతంలో జేపి మోర్గాన్ (J.P. Morgan) వంటి సంస్థలు ‘స్పూఫింగ్’ అనే టెక్నిక్ ద్వారా ధరలను కృత్రిమంగా పెంచినందుకు రూ. 7,600 కోట్ల జరిమానా చెల్లించిన ఉదంతాలను విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. సామాన్యులు ఎగబడి కొంటున్న సమయంలోనే, ఈ సంస్థలు లాభాల స్వీకరణకు (Profit Booking) పాల్పడి మార్కెట్‌ను పడగొట్టే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చరిత్ర పునరావృతమవుతుందా?

బంగారం ధరలు పీక్స్‌కు వెళ్లి మళ్లీ కుప్పకూలడం గతంలోనూ జరిగింది:

1980లో: రికార్డు స్థాయికి చేరిన ధర ఒక్కసారిగా 57% పడిపోయింది. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి ఏకంగా 25 ఏళ్లు పట్టింది.

2011లో: మళ్ళీ ధరలు భారీగా పెరిగి, తర్వాత 45% క్రాష్ అయ్యాయి. ఇది కోలుకోవడానికి 4 ఏళ్లు పట్టింది.

2026 అంచనా: ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2026లో కూడా ఇదే తరహా ప్రైస్ క్రాష్ జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.

ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు:

లిక్విడిటీ క్రంచ్: స్టాక్ మార్కెట్లు పడిపోయినప్పుడు, ఇన్వెస్టర్లు నగదు కోసం గోల్డ్ ఈటీఎఫ్‌లను (ETFs) విక్రయిస్తారు, దీనివల్ల సప్లై పెరిగి ధర తగ్గుతుంది.

రిటైల్ డిమాండ్ క్షీణత: ధరలు పెరగడంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు బంగారం కొనడం తగ్గించేశారు. డిమాండ్ తగ్గితే ధరల దిద్దుబాటు (Price Correction) తప్పదు.

నిపుణుల సలహా: బంగారం ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎగబడి కొనడం కంటే మార్కెట్ స్థిరీకరణ (Stabilization) అయ్యే వరకు వేచి చూడటం ఉత్తమం.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికలు, నిపుణుల అభిప్రాయాల మేరకు పొందుపరిచినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని hmtv న్యూస్ ధ్రువీకరించడం లేదు.

Tags:    

Similar News