Nominee Reasons: పాలసీ నుంచి బ్యాంకు ఖాతా వరకు నామినీ చాలా ముఖ్యం.. ఎందుకంటే..?

Nominee Reasons: బ్యాంకులో అకౌంట్‌ ఓపెన్‌ చేసినా, ఎల్‌ఐసీ పాలసీ కొనుగోలు చేసినా కచ్చితంగా నామినీ పేరుని చేర్చాలి.

Update: 2023-09-13 16:00 GMT

Nominee Reasons: పాలసీ నుంచి బ్యాంకు ఖాతా వరకు నామినీ చాలా ముఖ్యం.. ఎందుకంటే..?

Nominee Reasons: బ్యాంకులో అకౌంట్‌ ఓపెన్‌ చేసినా, ఎల్‌ఐసీ పాలసీ కొనుగోలు చేసినా కచ్చితంగా నామినీ పేరుని చేర్చాలి. ఒకవేళ మీరు నామినీ పేరుని చేర్చకుంటే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ప్రతి పెట్టుబడిలో నామినీ పేరుని ఎందుకు చేర్చాలి.. నామినీ అవసరం ఎంతవరకు ఉంటుంది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఏ పెట్టుబడి అయినా సరే నామినీ పేరుని చేర్చడం అవసరం. దీనివల్ల పాలసీదారుడు లేదా ఖాతాదారుడు మరణించిన సందర్భంలో వారికి రావాల్సిన డబ్బులు నామినీకి చెల్లిస్తారు. ఆర్థిక అవసరాల కోసం కుటుంబ సభ్యులు మరెవరినీ ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. మీరు లేనప్పుడు మీ ఖాతాలో జమ చేసిన మొత్తం నామినీకి అందిస్తారు. ఒకవేళ నామినీ పేరుని చేర్చకపోతే మీకు రావాల్సిన డబ్బును విత్‌డ్రా చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

నామినీగా ఎవరి పేరుని పెట్టకపోతే ఖాతాలో జమ చేసిన డబ్బును క్లెయిమ్ చేయడానికి కుటుంబ సభ్యులు బ్యాంకులు, ఆర్థిక సంస్థల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కానీ నామినీ పేరుని చేర్చితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా డబ్బులు తీసుకోవచ్చు. ఖాతాదారుడు లేదా పాలసీదారు నామినీని ప్రకటించకపోతే అతని ఖాతాలో జమ చేసిన మొత్తం బ్యాంకు సదరు సంస్థలకే చెందుతుంది.

ఎవరిని నామినీ చేయవచ్చు?

కుటుంబ సభ్యులలో ఎవరినైనా నామినీగా చేయవచ్చు. ఖాతాదారుడు తన బ్యాంకు ఖాతాలో ఎవరినైనా నామినీగా చేసుకోవచ్చు. నామినీ అంటే ఖాతాదారుడు విశ్వసించే వ్యక్తి అని అర్థం. చాలామంది తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి, పిల్లలని నామినీగా చేర్చుతారు.

Tags:    

Similar News