సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు .. మీ ఖర్చులకు ఏం మార్పు?
సెప్టెంబర్ 1 నుంచి పలు రంగాల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇవి మీ ఇంటి బడ్జెట్, బ్యాంకింగ్, ఇంధనం, పెట్టుబడులపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముందుగానే ఈ మార్పులు తెలుసుకుంటే మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు.
సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు .. మీ ఖర్చులకు ఏం మార్పు?
సెప్టెంబర్ 1 నుంచి పలు రంగాల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇవి మీ ఇంటి బడ్జెట్, బ్యాంకింగ్, ఇంధనం, పెట్టుబడులపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముందుగానే ఈ మార్పులు తెలుసుకుంటే మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు.
1. వెండి హాల్‌మార్కింగ్ తప్పనిసరి
బంగారంలాగే ఇప్పుడు వెండికీ హాల్‌మార్క్ తప్పనిసరి అవుతుంది. దీంతో వెండి నాణ్యత స్పష్టమవుతుంది. కానీ దీని వల్ల వెండి ధరలు పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. వెండి ఆభరణాలు కొనేవారు జాగ్రత్తగా ఉండాలి.
2. ఎస్‌బీఐ కార్డులపై కొత్త ఛార్జీలు
ఎస్‌బీఐ కార్డు వినియోగదారులకు కొత్త రూల్స్ వర్తిస్తాయి. ఆటో డెబిట్ విఫలమైతే 2% జరిమానా విధిస్తారు. అంతర్జాతీయ లావాదేవీలు, ఇంధనం కొనుగోలు, ఆన్‌లైన్ షాపింగ్‌పై అదనపు ఫీజులు ఉండొచ్చు. అలాగే రెవార్డ్ పాయింట్ల విలువ కూడా తగ్గే అవకాశం ఉంది.
3. ఎల్పీజీ ధరల మార్పు
ప్రతి నెల మొదటిరోజునానే, ఈసారి కూడా సెప్టెంబర్ 1న ఆయిల్ కంపెనీలు కొత్త ఎల్పీజీ ధరలు ప్రకటిస్తాయి. ధరలు పెరిగితే కిచెన్ బడ్జెట్‌పై భారమవుతుంది. తగ్గితే మాత్రం ఊరట లభిస్తుంది.
4. ఏటీఎం విత్‌డ్రాయల్ ఫీజులు
కొన్ని బ్యాంకులు కొత్త ఏటీఎం లావాదేవీ రూల్స్ తీసుకొస్తున్నాయి. నెలవారీ లిమిట్ మించి విత్‌డ్రాయల్ చేస్తే అధిక ఛార్జీలు పడతాయి. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తున్నారు.
5. ఎఫ్డీ వడ్డీ రేట్లు తగ్గే అవకాశం
కొన్ని బ్యాంకులు సెప్టెంబర్ నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించనున్నారు. ప్రస్తుతం 6.5%–7.5% వడ్డీ ఇస్తున్నా, త్వరలో ఈ రేట్లు తగ్గవచ్చని సమాచారం. ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారు త్వరగా వడ్డీ లాక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
6. మీ జేబుపై నేరుగా ప్రభావం
ఈ మార్పులు మీ డబ్బులపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఇంధనం కొనుగోలు, బ్యాంకింగ్ లావాదేవీలు, పెట్టుబడులు వంటి ప్రతీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. బడ్జెట్ ప్లాన్ చేసుకుని, పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఫైనాన్షియల్ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
మొత్తం మీద, సెప్టెంబర్ నుంచి అమలయ్యే ఈ కొత్త నియమాలు మీ జేబుకు చిల్లు పెట్టే అవకాశం ఉంది. ముందుగానే సన్నద్ధం అయితే ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.