New Cyber Fraud: OTP అవసరం లేకుండానే ఖాతా ఖాళీ!

జార్ఖండ్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఒక వృద్ధ మహిళ తన బ్యాంకు ఖాతా నుండి ₹10,000 కోల్పోయింది. ప్రధానమంత్రి కిసాన్ యోజన సహాయం అందిస్తామనే నెపంతో నేరస్థులు ఆమెను నమ్మించి, బయోమెట్రిక్ డేటా (కంటి స్కాన్) ద్వారా డబ్బును విత్‌డ్రా చేశారు.

Update: 2025-08-27 13:15 GMT

మోసం ఎలా జరిగింది?

ఇప్పటి పరిస్థితుల్లో ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఆధార్‌ నంబర్‌తో అనుసంధానించబడి ఉంటాయి. ఆధార్ లింక్‌ ద్వారా వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్‌తో డబ్బును విత్‌డ్రా చేసే అవకాశం ఉంది. ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తూ, స్కామర్లు ఆ మహిళ ఆధార్ వివరాలను ఉపయోగించి ఆమెకు తెలియకుండా ఖాతా నుంచి డబ్బు ఉపసంహరించారు.

జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి?

మీ ఆధార్‌ వివరాలను ఎవరికీ పంచుకోవద్దు.

అవసరమైతే UIDAI వెబ్‌సైట్‌లో వర్చువల్ ఆధార్ నంబర్ సృష్టించి ఉపయోగించండి.

UIDAI వెబ్‌సైట్ ద్వారా మీ బయోమెట్రిక్ డేటాను లాక్‌ చేయవచ్చు.

అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని అన్‌లాక్ చేసి, పని ముగిసిన తర్వాత మళ్లీ లాక్ చేయడం అలవాటు చేసుకోవాలి.

ఈ కొత్త రకం సైబర్ మోసం ప్రజల్లో అప్రమత్తత అవసరాన్ని మళ్లీ రుజువు చేస్తోంది. మీ ఆధార్‌ వివరాలు, బయోమెట్రిక్ డేటా రక్షణే మీ బ్యాంకు ఖాతా భద్రత.

Tags:    

Similar News