New Aadhaar Rules: ఒకే పుట్టిన సర్టిఫికెట్‌తో రెండు ఆధార్ కార్డులు సాధ్యమా?
యూఐడీఏఐ (UIDAI) ఆధార్ నిబంధనల్లో కొత్త సవరణలను జారీ చేసింది. ఒకే పుట్టిన సర్టిఫికేట్ ఆధారంగా రెండు వేర్వేరు బాల్ ఆధార్ కార్డులు రాకుండా ఈ మార్పులు చేశారు. తల్లిదండ్రుల అంగీకారంతో, ఐదు సంవత్సరాల లోపు పిల్లల ఆధార్ రిజిస్ట్రేషన్‌ను జనన మరణాల రిజిస్ట్రార్ లేదా రాష్ట్ర ముఖ్య రిజిస్ట్రార్‌తో పంచుకోవచ్చని స్పష్టం చేసింది.

కొత్త నిబంధనల ముఖ్యాంశాలు:
ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు బాల్ ఆధార్ తప్పనిసరి.
తల్లిదండ్రులలో ఒకరి ఆధార్ కార్డు ఆధారంగా కూడా పిల్లల ఆధార్ నమోదు చేయవచ్చు.
పిల్లల పేరు, జాతి, లింగం, చిరునామా, ఫోటో వంటి తప్పనిసరి వివరాలు సేకరిస్తారు.
1 అక్టోబర్ 2023 తర్వాత పుట్టిన పిల్లలకు పుట్టిన సర్టిఫికేట్ తప్పనిసరి.
తల్లిదండ్రులు లేదా గార్డియన్ సంతకం చేసి నమోదు కోసం అనుమతి ఇవ్వాలి.
మరణించిన వారి ఆధార్:
మరణించిన వ్యక్తుల ఆధార్ నంబర్ డీయాక్టివేషన్ విషయంపై కూడా UIDAI నూతన మార్పు చేసింది. Regulation 5 లో సవరణచేసి, డీయాక్టివేషన్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.
అస్సాం రాష్ట్రం నిర్ణయం:
ఇక అస్సాంలో పెద్దల కోసం కొత్త ఆధార్ కార్డులు ఇకపై జారీ చేయరు. కానీ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, టీ గార్డెన్ కమ్యూనిటీల సభ్యులకు ఒక సంవత్సరం అదనపు అవకాశం కల్పించారు.
ముఖ్యమంత్రి హిమంత బిస్వా సర్మా మాట్లాడుతూ – రాష్ట్రంలో ఇప్పటికే ఆధార్ సంతృప్తి సాధించిందని, చట్టవిరుద్ధ ప్రవాసులు ఆధార్ పొందకుండా ఆ ద్వారం మూసివేశామని తెలిపారు.