చాలా ఏళ్లు బ్యాంకు ఖాతా నిలిచిపోయిందా.. డబ్బులు విత్‌డ్రా చేయడం ఎలా..?

Unclaimed Fd: కొంతమంది డబ్బులని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి మరిచిపోతారు.

Update: 2022-10-15 09:03 GMT

చాలా ఏళ్లు బ్యాంకు ఖాతా నిలిచిపోయిందా.. డబ్బులు విత్‌డ్రా చేయడం ఎలా..?

Unclaimed Fd: కొంతమంది డబ్బులని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి మరిచిపోతారు. అది మెచ్యూర్‌ అయిన సంగతి కూడా గుర్తించరు. చాలా ఏళ్లు డబ్బు అదే అకౌంట్‌లో ఉంటుంది. ఇలాంటి ఖాతాలని బ్యాంకు నిలిపివేస్తుంది. అలాగే ఎఫ్‌డీ ఖాతాలో నామినీ పేరు నమోదు చేయకపోవడం వల్ల కొంతమంది డబ్బులు రాక ఇబ్బంది పడుతుంటారు. ఈ పరిస్థితిలో ప్రజలు విసిగిపోయి డబ్బు వదులుకుంటున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఇలాంటి డబ్బులని ఎలా విత్‌డ్రా చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

పొదుపు ఖాతాకి లింక్ చేసిన ఎఫ్‌డి ఖాతా చాలా సంవత్సరాలుగా పనిచేయకుంటే మూసివేస్తారు. దీనివల్ల ఖాతాదారుడు FD డబ్బును విత్‌డ్రా చేయలేరు. ఈ విధంగా ఒక చిన్న పొరపాటు పెద్దగా మారుతుంది. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం మెచ్యూరిటీతో కూడిన డిపాజిట్ డబ్బును 10 సంవత్సరాలలోపు విత్‌డ్రా చేయకపోతే అది డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌లో అంటే DEAFలో జమ అవుతుంది. తర్వాత ఈ డబ్బు తీసుకోవాలంటే ప్రత్యేక నిబంధనలు పాటించాలి.

ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. రెండేళ్లపాటు పొదుపు లేదా కరెంట్ ఖాతాలో లావాదేవీ జరగకపోతే ఆ ఖాతా ఇన్‌యాక్టివ్‌గా ప్రకటిస్తారు. అదేవిధంగా టర్మ్ డిపాజిట్ ఖాతాలోని డబ్బు మెచ్యూరిటీ తేదీ నుంచి 2 సంవత్సరాలలోపు విత్‌డ్రా చేయకపోతే ఆ ఖాతా నిష్క్రియఖాతాగా మారుతుంది. ఉదాహరణకు పొదుపు ఖాతాకు FD లింక్ అయి ఉంటే FD డబ్బు పొదుపు ఖాతాలోకి వచ్చినంత కాలం అది పని చేస్తూనే ఉంటుంది. వడ్డీ డబ్బు రాని సమయంలో పొదుపు ఖాతా నిష్క్రియంగా మారుతుంది.

అయితే పొదుపు ఖాతా మూసినప్పటికీ FD డబ్బుపై వడ్డీ వస్తూనే ఉంటుంది. కానీ FD మెచ్యూర్ అయినప్పుడు ఆ డబ్బు విత్‌డ్రా చేయనప్పుడు సమస్య ఏర్పడుతుంది. FD రేటు ప్రకారం ఈ డబ్బుపై వడ్డీ అందుబాటులో ఉండదు కానీ పొదుపు ఖాతా రేటుపై వడ్డీ లభిస్తుంది. అయితే సదరు కస్టమర్‌ బ్యాంక్ వెబ్‌సైట్‌ను తనిఖీ చేసి బ్రాంచ్‌ని సంప్రదించాలి. దీని కోసం క్లెయిమ్ ఫారమ్‌ను విధిగా నింపాలి. ఫారమ్‌తో పాటు డిపాజిట్ రసీదు, KYC పత్రాలను సమర్పించాలి. అయితే త్వరగా పనిని పూర్తి చేయాలనుకుంటే సొంత శాఖకు వెళ్లడం మంచిది.

ఒకవేళ ఖాతాదారు మరణించినట్లయితే క్లెయిమ్ ఫారమ్‌తో పాటు మరణ ధృవీకరణ పత్రాన్ని జత చేయాలి. మీరు నామినీ అయితే ఖచ్చితంగా గుర్తింపు కార్డు అందించాలి. తర్వాత బ్యాంకు అన్ని పత్రాలను పరిశీలించి ఖాతాలో ఉన్న డబ్బును విడుదల చేస్తుంది. పొదుపు ఖాతా ఇప్పటికే నిష్క్రియంగా ఉంటే దానిని సక్రియం చేయడం అవసరం. బ్యాంక్ మొదట డబ్బును కస్టమర్‌కు తిరిగి ఇస్తుంది. తర్వాత DEAF నుంచి వాపసు క్లెయిమ్ చేస్తుంది.

Tags:    

Similar News