Government Scheme: మహిళలకు గుడ్‌న్యూస్.. కేంద్రం నుంచి రూ.5వేలు.. నేరుగా ఖాతాలోకి.. అర్హత ఏంటంటే?

Pradhan Mantri Matru Vandana Yojana: ఈ పథకం కింద, దేశవ్యాప్తంగా జన్మించిన పిల్లలు పోషకాహార లోపంతో బాధపడకుండా, ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా మహిళలకు డబ్బు అందజేస్తారు.

Update: 2023-06-16 05:49 GMT

Government Scheme: మహిళలకు గుడ్‌న్యూస్.. కేంద్రం నుంచి రూ.5వేలు.. నేరుగా ఖాతాలోకి.. అర్హత ఏంటంటే?

Pradhan Mantri Matru Vandana Yojana: రైతులు, విద్యార్థులు, మహిళల కోసం మోదీ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. పీఎం కిసాన్ కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు 6000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుంది. అదేవిధంగా వివాహిత మహిళల కోసం కూడా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దేశంలోని మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది.

మోదీ ప్రభుత్వం గర్భిణీ స్త్రీల కోసం ప్రధాన మంత్రి మాతృ వందన యోజనను ప్రారంభించింది. ఇందులో ప్రభుత్వం గర్భిణీలకు 5000 రూపాయలు ఇస్తుంది. ఈ ప్రభుత్వ పథకంలో గర్భిణులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ పథకం కింద, దేశవ్యాప్తంగా జన్మించిన పిల్లలకు పోషకాహార లోపం లేకుండా, ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండటానికి మహిళలకు డబ్బును అందజేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని ప్రారంభించారు.

పథకం ప్రత్యేకత ఏమిటంటే?

- గర్భిణీ స్త్రీలకు కనీసం 19 ఏళ్లు ఉండాలి.

ఈ పథకంలో మీరు ఆఫ్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

స్థానిక ఆశా వర్కర్‌ను కలిసినా వారు ఈ స్కీమ్‌లో చేర్పిస్తారు. 

- ప్రభుత్వం రూ. 5000 మొత్తాన్ని 3 వాయిదాలలో బదిలీ చేస్తుంది. ఈ పథకం జనవరి 1, 2017న ప్రారంభించారు.

డబ్బు ఎలా అందిస్తారు?

లబ్ధిదారులైన మహిళలకు మూడు విడతల్లో పథకం సొమ్మును అందిస్తుంది. మొదటి విడత కింద రూ.1000, రెండో విడత రూ.2000, మూడో విడత రూ.2000లు అందిస్తుంది. ఈ డబ్బు నేరుగా గర్భిణుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయండి..

మీరు అధికారిక వెబ్‌సైట్ https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana ని చెక్ చేసి పూర్తి వివరాలు పొందవచ్చు. ఇక్కడ మీరు ఈ పథకం గురించిన మొత్తం సమాచారాన్ని పొందుతారు.

Tags:    

Similar News