Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు
Stock Market: సెన్సెక్స్ 74 పాయింట్లు, నిఫ్టీ 25 పాయింట్ల లాభం
Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు
Stock Market: దేశీయ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. 60వేల 202 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్.. కాసేపటికి స్వల్ప నష్టాల్లోకి జారుకుంది. మళ్లీ కోలుకుని 60వేల 268 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 74 పాయింట్ల లాభంతో 60వేల 130 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 25పాయింట్ల లాభంతో 17వేల 769.25 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ సైతం 81.91 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.