Petrol Diesel Prices : హైదరాబాద్ లో రూ.107.. విజయవాడలో రూ.109.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలివే

Petrol Diesel Prices : ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతల మధ్య భారత్‌లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే గ్యాస్ దిగుమతుల సమస్య వల్ల కమర్షియల్ గ్యాస్ సరఫరాలో 50% కోత విధించారు.

Update: 2026-03-26 05:11 GMT

 Petrol Price

Petrol Diesel Prices : ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బ్యారెల్ ధర $100 మార్కును దాటి సామాన్యుడిని భయపెడుతున్నా, భారత ప్రభుత్వం తీసుకుంటున్న వ్యూహాత్మక చర్యల వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికీ స్థిరంగా ఉండటం గమనార్హం. అయితే అంతర్జాతీయ సరఫరా మార్గాల్లో నెలకొన్న అడ్డంకులు ఎల్‌పిజి రంగంపై మాత్రం కొంత ప్రభావం చూపుతున్నాయి. అసలు దేశంలో ఇంధన నిల్వలు ఎలా ఉన్నాయి? గ్యాస్ కష్టాలు ఎందుకు మొదలయ్యాయి? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పశ్చియాసియాలో యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ స్పందిస్తూ.. దేశంలోని రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, మన దగ్గర తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. కేవలం పశ్చియాసియాపైనే ఆధారపడకుండా పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి చమురు దిగుమతులను వైవిధ్యపరచడం వల్ల భారత్ సురక్షితంగా ఉందని ఆమె భరోసానిచ్చారు. కాబట్టి వినియోగదారులు భయాందోళనతో ఇంధనాన్ని నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

పెట్రోల్ విషయంలో ఊరట లభించినా, ఎల్‌పిజి రంగంలో మాత్రం పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. భారత్ తన గ్యాస్ అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. మనకు గ్యాస్ సరఫరా చేసే ఖతార్‌లోని ప్లాంట్లు దెబ్బతినడం, హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల సరఫరా గొలుసు దెబ్బతింది. ఈ ప్రభావం సామాన్యుడిపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం గృహ అవసరాల సిలిండర్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. అయితే, హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలకు ఇచ్చే కమర్షియల్ గ్యాస్ సరఫరాలో ఏకంగా 50 శాతం కోత విధించింది. దీనివల్ల రాబోయే రోజుల్లో బయట భోజనాల ధరలు పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $95 నుంచి $103 మధ్య ఊగిసలాడుతోంది. విదేశాల్లో ధరలు కొంత తగ్గుముఖం పడుతున్నా, ఇండియన్ బాస్కెట్ ధర మాత్రం బ్యారెల్‌కు $157.04 వద్ద కొనసాగుతోంది. ప్రాంతీయ సరఫరాలో ఉన్న రిస్క్ ప్రీమియం మరియు రవాణా ఖర్చుల వల్ల ఈ ధర ఎక్కువగా ఉంది. అయినప్పటికీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం ధరలను సమీక్షిస్తూ సామాన్యుడిపై భారం పడకుండా జాగ్రత్త పడుతున్నాయి.

ప్రధాన నగరాల్లో నేటి ధరలు (లీటర్)

దేశంలోని వివిధ నగరాల్లో నేటి ఇంధన ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో పెట్రోల్ రూ.94.77, ముంబైలో రూ.103.54 గా ఉన్నాయి. దక్షిణాది నగరాల్లో ధరలు కొంత ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.107.46 కాగా, డీజిల్ రూ.95.70 వద్ద ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పెట్రోల్ రూ.109.65 వద్ద విక్రయించబడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే ఈ ధరలను సవరిస్తుంటారు.

Tags:    

Similar News