వినియోగదారులకి అలర్ట్‌.. ఉచిత ఎల్పీజీ సబ్సిడీ కనెక్షన్‌లో మార్పులు..!

LPG Connection: ఉజ్వల పథకం కింద ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌పై లభించే సబ్సిడీలో మార్పు జరిగే అవకాశం ఉంది.

Update: 2022-11-05 10:29 GMT

వినియోగదారులకి అలర్ట్‌.. ఉచిత ఎల్పీజీ సబ్సిడీ కనెక్షన్‌లో మార్పులు..!

LPG Connection: ఉజ్వల పథకం కింద ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌పై లభించే సబ్సిడీలో మార్పు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఉచిత ఎల్పీజి కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. నివేదిక ప్రకారం ఉజ్వల పథకం కింద కొత్త కనెక్షన్ల కోసం సబ్సిడీ నిర్మాణంలో మార్పు ఉండవచ్చు.

పెట్రోలియం మంత్రిత్వ శాఖ రెండు కొత్త నిర్మాణాలకు సంబంధించిన పనులను త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో కోటి కొత్త కనెక్షన్లు ఇస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం OMCల తరపున ముందస్తు చెల్లింపు నమూనాను మార్చవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ ఉజ్వల పథకం కింద వినియోగదారులకు 14.2 కిలోల సిలిండర్‌, స్టవ్‌ అందజేస్తారు. దీని ధర సుమారు రూ.3200. అయితే ప్రభుత్వం నుంచి రూ.1600 సబ్సిడీ వస్తుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసిలు) అడ్వాన్స్‌గా రూ.1600 ఇస్తాయి. అయితే OMCలు రీఫిల్‌లపై సబ్సిడీ మొత్తాన్ని EMIగా వసూలు చేసుకుంటున్నాయి.

ఉజ్వల పథకంలో ఎలా నమోదు చేసుకోవాలి..?

1. ఉజ్వల పథకంలో BPL కుటుంబానికి చెందిన ఒక మహిళ గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

2. pmujjwalayojana.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం వల్ల పథకం గురించి పూర్తి సమాచారాన్ని పొందుతారు.

3. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా ఒక ఫారమ్‌ను పూరించి సమీపంలోని LPG పంపిణీదారుకి అందించాలి.

4. ఈ ఫారమ్‌లో దరఖాస్తు చేసుకున్న మహిళ తన పూర్తి చిరునామా, జన్ ధన్ బ్యాంక్ ఖాతా, కుటుంబ సభ్యులందరి ఆధార్ నంబర్‌ను అందించాలి.

5. తరువాత దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు అర్హులైన లబ్ధిదారునికి LPG కనెక్షన్‌ను జారీ చేస్తాయి.

6. వినియోగదారు EMIని ఎంచుకుంటే సిలిండర్‌పై పొందే సబ్సిడీలో EMI వసూలు చేసుకుంటారు.

Tags:    

Similar News