LPG Consumers: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. తక్కువ ధరలకే సిలిండర్లు లభిస్తాయి..!

LPG Consumers: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని పెంచుతున్నట్లు త్వరలో ప్రకటించనుంది. దీనివల్ల కోట్లాది మంది గ్యాస్ వినియోగదారులకు ఉపశమనం లభిస్తుంది.

Update: 2023-11-16 07:26 GMT

LPG Consumers: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. తక్కువ ధరలకే సిలిండర్లు లభిస్తాయి..!

LPG Consumers: వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు LPG వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనం అందించాలని భావిస్తోంది. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని పెంచుతున్నట్లు త్వరలో ప్రకటించనుంది. దీనివల్ల కోట్లాది మంది గ్యాస్ వినియోగదారులకు ఉపశమనం లభిస్తుంది.

కస్టమర్ బేస్ పెంచడంపై దృష్టి

ఉజ్వల పథకం ప్రయోజనాలను వీలైనన్ని ఎక్కువ కుటుంబాలకు విస్తరించేందుకు వినియోగదారుల సంఖ్యను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోంది. సెప్టెంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 5.02 శాతానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం రేటును 4 నుంచి 6 శాతం రేంజ్‌లో ఉంచాలని ప్రభుత్వం ఆర్‌బీఐకి లక్ష్యాన్ని నిర్దేశించింది. జూలైలో ద్రవ్యోల్బణం 15 నెలల రికార్డు స్థాయికి చేరుకుంది.

ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.903

ప్రస్తుతం ఉజ్వల పథకం లబ్ధిదారులు ఏడాదికి 12 సిలిండర్‌లపై ఒక్కో సిలిండర్‌పై రూ.300 సబ్సిడీని పొందుతున్నారు. ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.903. సబ్సిడీ పొందిన తర్వాత లబ్ధిదారులు రూ.603కే సిలిండర్‌ను పొందుతున్నారు. ఇటీవల, కేంద్ర మంత్రివర్గం సుమారు 9.6 కోట్ల తక్కువ ఆదాయ కుటుంబాలకు గ్యాస్ సబ్సిడీపై ఉపశమనం ఇచ్చింది. అల్పాదాయ కుటుంబాలకు ఎల్‌పీజీ సబ్సిడీని ప్రభుత్వం సిలిండర్‌పై రూ.200 నుంచి రూ.300కి పెంచింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం మరోసారి ప్రయత్నిస్తోంది. ఉజ్వల పథకం విస్తరణ కింద 75 లక్షల మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ప్రభుత్వం ఆమోదించింది. తర్వాత లబ్ధిదారుల సంఖ్య 10 కోట్లు దాటనుంది. అక్టోబర్‌లో సబ్సిడీ మొత్తాన్ని రూ.100 పెంచిన తర్వాత లబ్ధిదారులు గతంలో 14.2 కిలోల సిలిండర్‌కు సబ్సిడీ తర్వాత రూ.703 చెల్లించాల్సి వచ్చింది. కానీ సబ్సిడీ రూ.200 నుంచి రూ.300కి పెరగడంతో ఇప్పుడు సిలిండర్ ధర రూ.603గా ఉంది.

Tags:    

Similar News