Best Home Loans: హోమ్‌లోన్‌ కోసం వెతుకుతున్నారా.. మిగతా వాటితో పోలిస్తే ఈ బ్యాంకులు బెటర్‌..!

Best Home Loans: ప్రతి ఒక్కరికీ సొంతిళ్లు నిర్మించుకోవాలని ఉంటుంది. కానీ ఇది కొందరికే సాధ్యమవుతుంది. అయితే ఈ రోజుల్లో ప్లాన్‌ ప్రకారం వెళితే సాధ్యం కానిదంటూ ఏదీలేదు.

Update: 2023-11-17 06:54 GMT

Best Home Loans: హోమ్‌లోన్‌ కోసం వెతుకుతున్నారా.. మిగతా వాటితో పోలిస్తే ఈ బ్యాంకులు బెటర్‌..!

Best Home Loans: ప్రతి ఒక్కరికీ సొంతిళ్లు నిర్మించుకోవాలని ఉంటుంది. కానీ ఇది కొందరికే సాధ్యమవుతుంది. అయితే ఈ రోజుల్లో ప్లాన్‌ ప్రకారం వెళితే సాధ్యం కానిదంటూ ఏదీలేదు. ఒక ప్రణాళిక ప్రకారం వెళితే సొంతిళ్లు మీ సొంతమవుతుంది.ఈ రోజుల్లో బ్యాంకింగ్‌ రంగం విస్తరించడం వల్ల ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు పోటీ పడి హోమ్‌లోన్స్‌ అందిస్తున్నాయి. అయితే ఏ బ్యాంకు తక్కువ వడ్డీకి లోన్ ఇస్తుందో ఆ బ్యాంకులో లోన్ తీసుకోవడం ఉత్తమం. అలాంటి కొన్ని బ్యాంకుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రస్తుతం హోమ్‌ లోన్స్‌పై 8.40 శాతం నుంచి వడ్డీ రేట్లను అందిస్తోంది. హోమ్‌ లోన్స్‌పై 0.17 శాతం ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది. ఇక హౌసింగ్ లోన్స్‌పై ఎస్‌బీఐ బ్యాంక్‌ వడ్డీపై 60 బేసిస్‌ పాయింట్ల తగ్గింపును అందిస్తుంది. ఈ ఆఫర్‌ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రస్తుతం హోమ్‌ లోన్స్‌పై 8.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 0.50 ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తోంది. ఇది గరిష్టంగా రూ. 25,000 వరకు ఉంటుంది. ఇక వడ్డీ రేట్లు కస్టమర్ సిబిల్ స్కోర్‌పై ఆధారపడి ఉంటాయి. సిబిల్ స్కోర్ 750 పాయింట్స్‌ కంటే ఎక్కువగా ఉంటే వడ్డీ రేటు 8.60 శాతంగా ఉంటుంది. సిబిల్‌ 750 కంటే తక్కువ ఉంటే వడ్డీ రేటు పెరుగుతుందని గుర్తుంచుకోండి.

ఇండియన్‌ బ్యాంక్‌

ఇండియన్‌ బ్యాంక్‌ ప్రస్తుతం హోమ్‌ లోన్స్‌పై 8,50 శాతం నుంచి 9.90 శాతం వరకు వడ్డీని వసూలుచేస్తోంది. హోమ్ లోన్స్ పై 0.23 శాతం ప్రాసెసింగ్ ఫీజును తీసుకుంటోంది. అయితే సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటు మారుతుంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌

ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులకు పోటీగా ప్రైవేట్ బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ అయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ హోమ్‌ లోన్స్‌ని 9 శాతం వడ్డీ రేటుకు అందిస్తోంది. సిబిల్‌ స్కోర్‌ 750 నుంచి 800 వరకు ఉన్న వారికే ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఇంతకంటే తక్కువ ఉంటే వడ్డీ రేటు 9.25 శాతంగా ఉంటుంది.

Tags:    

Similar News