Per Capita Income: తలసరి ఆదాయం అంటే ఏంటి?
Per Capita Income: దేశంలోని అన్ని తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్‌లో నిలిచింది. అయితే తలసరి ఆదాయం అంటే ఏంటి? దీన్ని ఎలా లెక్కిస్తారు?
Per Capita Income: తలసరి ఆదాయం అంటే ఏంటి?
Per Capita Income: దేశంలోని అన్ని తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్‌లో నిలిచింది. అయితే తలసరి ఆదాయం అంటే ఏంటి? దీన్ని ఎలా లెక్కిస్తారు? దీనివల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం.
తలసరి ఆదాయంలో మరోసారి తెలంగాణ టాప్
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2023-24 ప్రాథమిక అంచనాల మేరకు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,56, 564 గా నమోదైంది. జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.1,84, 205. జాతీయ సగటు కంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,72,359 కంటే ఎక్కువగా ఉంది. 2022-23 నుంచి2023-24 మధ్య కాలంలో ఇది 14.1 శాతం పెరిగింది.
తలసరి ఆదాయం అంటే ఏంటి?
తలసరి ఆదాయం అనేది ఒక దేశం లేదా రాష్ట్రం లేదా ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రతి వ్యక్తి సంపాదించే సగటు ఆదాయానికి కొలమానంగా చెబుతారు. ఆ దేశం లేదా రాష్ట్రం లేదా ఆ ప్రాంతంలోని మొత్తం ఆదాయాన్ని అక్కడి మొత్తం జనాభాతో భాగించడం ద్వారా వచ్చే ఫలితమే తలసరి ఆదాయంగా చెబుతారు. తలసరి ఆదాయం దేశాభివృద్ధికి కొలమానంగా చూస్తారు. తలసరి ఆదాయం ఆ దేశ లేదా ఆ ప్రాంత జీవన ప్రమాణాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతోంది. అయితే తలసరి ఆదాయం లెక్కించే విధానంలో లోపాలున్నాయనే వాదన కూడా ఉంది.
తలసరి ఆదాయంపై లోపాలు
తలసరి ఆదాయం లెక్కించే సమయంలో ద్రవ్యోల్బణం, ఆదాయ అసనమానతలు, సంపద లేదా సేవింగ్స్‌ను ఈ పద్దతిలో లెక్కించలేం. కొందరి వద్దే ఉన్న సంపద లేదా ఆదాయం తలసరి ఆదాయంగా మారనుంది. ఇది శాస్త్రీయంగా సరైంది కాదనే వాదించేవారు కూడా ఉన్నారు.
ఆయా ప్రాంతాల్లోని ప్రజల కొనుగోలు శక్తిని అనుసరించి తలసరి ఆదాయంపై లెక్కలు తీస్తేనే వాస్తవ ఫలితాలు వస్తాయనే అభిప్రాయం కూడా ఉంది.
అమెరికాలో తలసరి ఆదాయం ఎలా లెక్కిస్తారు?
అమెరికాలో ప్రతి ఏటా అమెరికా సెన్సెస్ బ్యూరో తలసరి ఆదాయంపై సర్వే నిర్వహిస్తోంది. 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సుకన్న ప్రతి ఒక్కరికీ అంతకు ముందు వచ్చిన ఆదాయాన్ని తీసుకుంటుంది. దీని ఆధారంగా సగటు ఆదాయం ఎంతో లెక్కలు తీస్తోంది. ప్రజలకు వచ్చే ఆదాయం, వడ్డీ ఆదాయం, ట్రస్టుల నుంచి వచ్చే ఆదాయం, డివిడెండ్, సామాజిక భద్రత, సంక్షేమం వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.