MGNREGA Payment: ఉపాధి హామీ పథకంపై కీలక అప్‌డేట్.. కూలీ డబ్బులు అకౌంట్లో పడాలంటే ఇలా చేయాల్సిందే..!

MGNREGA Payment: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGA), కూలీలకు చాలా ప్రయోజనాలు అందించబడుతున్నాయి. దీనితో పాటు, ఈ పథకం కూలీల ఉపాధికి చాలా ఉపయోగకరంగా ఉంది.

Update: 2023-08-26 04:30 GMT

MGNREGA Payment: ఉపాధి హామీ పథకంపై కీలక అప్‌డేట్.. కూలీ డబ్బులు అకౌంట్లో పడాలంటే ఇలా చేయాల్సిందే..!

MGNREGA: దేశంలో ప్రజల ప్రయోజనాల కోసం అనేక రకాల పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకాల ద్వారా ప్రజలకు వివిధ రకాల ప్రయోజనాలు ప్రభుత్వం అందజేస్తోంది. దీంతో పాటు ఉపాధి కోసం ప్రభుత్వం ద్వారా అనేక రకాల పనులు జరుగుతున్నాయి. ఈ పథకాలలో ఒకటి MNREGA కూడా. ఈ పథకం ద్వారా పేదలు లబ్ధి పొందుతున్నారు. అదే సమయంలో MNREGAకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ తెరపైకి వచ్చింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGA) కింద కార్మికులకు ఏకైక చెల్లింపు విధానంగా ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని అమలు చేయడానికి గడువు ఆగస్టు 31 తర్వాత పొడిగించరని తేలింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. MGNREGA కింద నమోదైన వ్యక్తులకు వేతనాలు చెల్లించేందుకు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ABPS)ని ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

క్రియాశీల లబ్ధిదారు..

ABPSని తప్పనిసరిగా స్వీకరించడానికి గడువు మొదటిది ఫిబ్రవరి 1గా నిర్ణయించారు. ఇది తరువాత మార్చి 31, ఆ తరువాత జూన్ 30, అనంతరం ఆగస్టు 31 వరకు పొడిగించారు. అయితే, ఇప్పుడు ఆగస్టు 31కి మించి పొడిగించబోమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జూన్‌లో మంత్రిత్వ శాఖ ద్వారా విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, మొత్తం 14.28 కోట్ల క్రియాశీల లబ్ధిదారులలో, 13.75 కోట్ల మంది ఆధార్ నంబర్‌లతో అనుసంధానించినట్లు తేలింది.

ఈమేరకు ప్రత్యేక శిబిరాలను నిర్వహించిన మంత్రిత్వ శాఖ, మొత్తం 12.17 కోట్ల ఆధార్ నంబర్‌లు ప్రామాణీకరించామని తెలిపింది. ఆ సమయంలో 77.81 శాతం మంది ABPSకి అర్హులుగా గుర్తించారు. మేలో, MNREGA కింద 88 శాతం చెల్లింపులు ABPS ద్వారా జరిగాయి. ఏబీపీఎస్‌ను 100 శాతం స్వీకరించేందుకు క్యాంపులు నిర్వహించి లబ్ధిదారులకు తెలియజేయాలని రాష్ట్రాలను కోరినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News