Petrol Pump Frauds: పెట్రోల్‌ కొట్టించుకునేటప్పుడు వీటిని గమనించండి.. లేదంటే మోసపోతారు..!

Petrol Pump Frauds: ఈ రోజుల్లో పెట్రోల్‌ బంకుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. జాగ్రత్తగా లేకపోతే కళ్లు మూసి తెరిచేలోపల జరిగే నష్టం జరుగుతోంది.

Update: 2023-10-13 15:00 GMT

Petrol Pump Frauds: పెట్రోల్‌ కొట్టించుకునేటప్పుడు వీటిని గమనించండి.. లేదంటే మోసపోతారు..!

Petrol Pump Frauds: ఈ రోజుల్లో పెట్రోల్‌ బంకుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. జాగ్రత్తగా లేకపోతే కళ్లు మూసి తెరిచేలోపల జరిగే నష్టం జరుగుతోంది. వెహికల్స్‌తో బంక్‌కి వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది రకరకాలుగా మోసం చేయడానికి ట్రై చేస్తారు. ఏమరుపాటుగా ఉంటే ఇక అంతేసంగతులు. బంకులోకి వెళ్లినప్పుడు కచ్చితంగా గమనించే కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. పెట్రోల్‌ సరిగ్గా రాలేదని అనుమానం వస్తే ఏం చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

మీటర్ జీరో కు సెట్ చేయాలి

మీరు బండ్లో పెట్రోల్ కొట్టించడానికి ముందు కచ్చితంగా పెట్రోల్ పంప్ మీటర్ జీరోకు సెట్ చేశారో లేదు చెక్ చేయండి. లేదంటే అడిగి మరీ సున్నాకు సెట్ చేయమని చెప్పండి. ఆ తర్వాతే ట్యాంక్ ఫిల్ చేయమని చెప్పండి. ఎందుకంటే మీరు రూ.500 పెట్రోల్ కొట్టమని అడిగితే బంకు సిబ్బంది డెరైక్టుగా రూ. 200 నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ 200 అంతకుముందు కస్టమర్ కు కొట్టిన పెట్రోల్. మీరు చూడకపోతే దాన్నే కంటిన్యూ చేస్తారు. అప్పుడు మీరు 500 ఇచ్చినా రూ. 300 పెట్రోలే వస్తుంది.

ట్యాంకులో తక్కువ పెట్రోల్

బంకు సిబ్బంది మమ్మల్ని మోసం చేశారని అనిపిస్తే వెంటనే ట్యాంకులో పెట్రోల్ తీసైనా ఎంత పోశారో కొలవండి. మీరు చెప్పిన దానికంటే తక్కువ ఉంటే వెంటనే నిలదీసి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి.

ఏమరపాటు వద్దు

మిమ్మల్ని ఏమార్చేందుకు బంకు సిబ్బంది పెట్రోల్ కొడుతుండగానే కార్డు ద్వారా పేమెంట్ చేస్తే పిన్ ఎంటర్ చేయమని అడిగడం లేదంటే మీకు రీడింగ్‌ కనిపించకుండా చేయడం వంటివి చేస్తారు. ఇలా మిమ్మల్ని మాటల్లో పెట్టి పెట్రోల్ తక్కువ కొట్టడమో, మీటర్ మార్చడమో చేస్తుంటారు. కాబట్టీ ఏమరపాటు వద్దు. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాతే బిల్లు పే చేయడంవంటివి చేస్తే ఉత్తమం.

పవర్ పెట్రోల్

మీరు బంకుకు వెళ్లినప్పుడు ఒక్కోసారి మిమ్మల్ని అడగకుండానే పవర్ పెట్రోల్ ఫిల్ చేస్తుంటారు కొందరు సిబ్బంది. దీని ఖరీదు సాధారణ పెట్రోల్ కంటే ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఏ పెట్రోల్ కొడుతున్నాడో కూడా చూసుకోవడం అవసరం.

Tags:    

Similar News