కళ్యాణ్ జువెల్లర్స్ వ్యవస్థాపకులు కళ్యాణరామన్ ఆత్మకథ రిలీజ్
Kalyan Jewellers:ది గోల్డెన్ టచ్ పేరుతో ఆటోబయోగ్రఫీ రాసిన కళ్యాణరామన్
కళ్యాణ్ జువెల్లర్స్ వ్యవస్థాపకులు కళ్యాణరామన్ ఆత్మకథ రిలీజ్
Kalyan Jewellers: ప్రముఖ వ్యాపారవేత్త, కల్యాణ్ జువెల్లర్స్ వ్యవస్థాపకుడు టీఎస్ కళ్యాణరామన్ ఆత్మకథ ది గోల్డెన్ టచ్‌ను బాలీవుడ్ మెగాస్టార్, కల్యాణ్ జువెల్లర్స్ బ్రాండ్ అంబాసిడర్ అమితాబ్ బచ్చన్ ఆవిష్కరించారు. ముంబైలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కల్యాణ రామన్ తన ఆటో బయోగ్రఫీ తొలి కాపీని అమితాబ్ బచ్చన్‌కు అందించారు.
కల్యాణ రామన్ జీవితం యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్‌కు ఎంతో స్ఫూర్తిని ఇస్తుందన్నారు అమితాబచ్చన్. కల్యాణ్ జువెల్లర్స్‌ను అంతర్జాతీయ బ్రాండ్‌గా తీర్చిదిద్దడంలో కల్యాణ రామన్ కృషి మరవలేనిదని తెలిపారు. ఈ ఆటో బయోగ్రఫీలో కల్యాణరామన్ బిజినెస్ జర్నీ, ఆయన ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు కల్యాణ రామన్. తన లైఫ్ స్టోరీ యంగ్ ఎంటర్‌ప్రీనర్స్‌కు స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.