Hyderabad: హైదరాబాద్‌కి గోకులం జువెల్స్‌.. కాజ‌ల్ చేతుల మీదుగా లాంచ్

Gokulam Signature Jewels: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో గోకులం సిగ్నేచర్ జువెల్స్ కొత్త షోరూమ్‌ను ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఆదివారం ప్రారంభించారు.

Update: 2025-05-05 09:28 GMT

Gokulam Signature Jewels: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో గోకులం సిగ్నేచర్ జువెల్స్ కొత్త షోరూమ్‌ను ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఆదివారం ప్రారంభించారు. నెక్సస్ మాల్ ఎదురుగా వాసవి శ్రీశ్రీ సిగ్నేచర్‌లో ఏర్పాటు చేసిన ఈ అవుట్‌లెట్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు పొత్తూరి సుబ్బా రావు, లలిత కుమారి, బాబు రావు మాట్లాడుతూ, "తెనాలికి గర్వకారణమైన గోకులం ఇప్పుడు హైదరాబాద్‌లోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. భారతీయ మహిళలకు స‌రిపోయే డిజైన్లతో సిల్వర్ జ్యువెలరీకి కొత్త దిశగా ప్రయాణం ప్రారంభమవుతోంది" అన్నారు.

కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ, "ఇక్కడ లభిస్తున్న ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, సిల్వర్ ఆభరణాలు వివాహ వేడుకలు సహా అన్ని సందర్భాలకు బాగుంటాయి. నేను వేసుకున్న డైమండ్ సెట్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది" అని తెలిపారు.

షోరూమ్‌లో గాజులు, మంగళసూత్రం, ప్రత్యేక బ్రైడల్ సెగ్మెంట్ వంటి విభాగాలు ఉన్నాయి. బ్రాండ్‌ను శ్రీకృష్ణుడి నివాసం ‘గోకులం’ నుండి ప్రేరణ తీసుకొని రూపొందించారని నిర్వాహకులు చెప్పారు. ‘NEELA’ పేరుతో ల్యాబ్ గ్రోన్ వజ్రాల ప్రత్యేక శ్రేణిని గోకులం పరిచయం చేసింది. ఇది పర్యావరణ స్పృహతో కూడిన, నైతికంగా సిద్ధమైన ఆభరణాలతో రూపొందించారు. ఇటీవల బ్రాండ్‌కి డేవిడ్ వార్నర్ ప్రచారకర్తగా చేరడం విశేషం. ఈ ప్రారంభోత్సవానికి కాజల్ హాజరైన విషయం తెలిసిన అభిమానులు భారీగా వచ్చి సందడి చేశారు.

Tags:    

Similar News