సుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే అవకాశం..!

Interest Rate: ఆర్బీఐ రెపోరేటుని పెంచుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ బ్యాంకుల నుంచి ప్రైవేట్ బ్యాంకుల వరకు.. ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి రికరింగ్ డిపాజిట్ల వరకు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.

Update: 2022-08-19 15:30 GMT

సుకన్య సమృద్ధియోజన, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లు పెరిగే అవకాశం..!

Interest Rate: ఆర్బీఐ రెపోరేటుని పెంచుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ బ్యాంకుల నుంచి ప్రైవేట్ బ్యాంకుల వరకు.. ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి రికరింగ్ డిపాజిట్ల వరకు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో ఖాతాదారులకి పెద్ద ఊరట లభించనుంది. అంతేకాకుండా ఇప్పుడు ఎన్‌ఎస్‌సీ, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లను కూడా పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

సెప్టెంబరులో ఆర్థిక మంత్రిత్వ శాఖ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తుందని అప్పుడు ఈ పథకాలపై వడ్డీ రేట్లను పెంచవచ్చని అందరు భావిస్తున్నారు. ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై వార్షిక వడ్డీ రేటు 7.1 శాతం, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ పై 6.8 శాతం, సుకన్య సమృద్ధి యోజనపై 7.6 శాతం, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై 7.4 శాతం, రైతులకు 6.9 శాతం వడ్డీ రేటు ఇస్తోంది. కిసాన్‌వికాస్ పత్రపై ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 5.5 శాతం, ఒకటి నుంచి ఐదేళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.5-6.7 శాతం. ఐదేళ్ల డిపాజిట్ పథకంపై 5.8 శాతం వడ్డీ చెల్లిస్తోంది.

జూన్ 30, 2022న ఆర్బీఐ రెపో రేటును రెండుసార్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చలేదు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు 30, 2022న మూడో త్రైమాసికానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News