Gulf Conflict: హైదరాబాద్‌లో గ్యాస్ కష్టాలు..రోడ్లపై బిర్యానీ వండుతన్న ప్రముఖ రెస్టారెంట్లు

Gulf Conflict: పశ్చిమాసియా యుద్ధంప్రభావంతో హైదరాబాద్‌లో సీఎన్‌జీ కొరత, రైల్వేలో ఆహార సేవలపై ఆంక్షలు. తాజా పరిణామాలు , ప్రయాణికులకు అవసరమైన సూచనలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Update: 2026-03-12 02:57 GMT

Gulf Conflict: హైదరాబాద్‌లో గ్యాస్ కష్టాలు..రోడ్లపై బిర్యానీ వండుతన్న ప్రముఖ రెస్టారెంట్లు

 LPG and CNG shortage: పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన హైదరాబాద్‌ నగరంపై, అటు భారతీయ రైల్వే వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న ఈ భీకర పోరు, హార్ముజ్ జలసంధిని దిగ్బంధం చేయడంతో ప్రపంచ చమురు సప్లై చైన్ కుప్పకూలింది. దీని ఫలితంగా మన దేశంలో LPG, CNG కొరత 'అత్యవసర సంక్షోభం'గా మారింది.

హైదరాబాద్ రోడ్లపై గ్యాస్ అన్వేషణ

నగరంలో రోజువారీ 2.1 లక్షల కిలోల సీఎన్‌జీ అవసరం ఉండగా, ఇప్పుడు కేవలం 50 శాతమే అందుబాటులో ఉంది. ఫలితంగా..గరంలోని 70కి పైగా స్టేషన్ల వద్ద ఆటోలు, క్యాబ్‌లు 6 నుండి 8 గంటల పాటు నిరీక్షిస్తున్నాయి.ఉపాధి కోల్పోయి, డ్రైవర్లు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల అక్రమ వసూళ్లు, వంట గ్యాస్‌ను ఆటో సిలిండర్లలో నింపుకుంటున్న ప్రమాదకర దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

రైల్వే ప్యాంట్రీలపై యుద్ధ మేఘాలు

ఈ సంక్షోభం భారతీయ రైల్వే మెనూను మార్చేసింది. గ్యాస్ కొరత కారణంగా..బేస్ కిచెన్లలో గ్యాస్ లభ్యత లేకపోవడంతో, సుదూర రైళ్లలో వండిన ఆహార సరఫరాను నిలిపివేసే యోచనలో రైల్వే బోర్డు ఉంది. టికెట్ బుకింగ్ సమయంలో భోజనం కోసం చెల్లించిన వారికి సొమ్ము తిరిగి ఇచ్చేలా నిబంధనలు మారుస్తున్నారు. ఇకపై రైల్వే ఫుడ్ ప్లాజాల్లో మైక్రోవేవ్ ఆహారం, రెడీ-టు-ఈట్ ప్యాకెట్లకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రయాణికులు సొంతంగా ఆహారం తెచ్చుకోవడం ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు.

ప్రభుత్వ వ్యూహం

కేంద్ర ప్రభుత్వం Essential Commodities Act కింద గృహ అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ, వాణిజ్య అవసరాలకు సరఫరా తగ్గించింది. బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, యుద్ధం సద్దుమణిగే వరకు పరిస్థితి ఇలాగే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రయాణికులకు సూచన

రాబోయే రోజుల్లో మీరు ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే, రైల్వే క్యాటరింగ్‌పై పూర్తిగా ఆధారపడకండి. అలాగే, నగరంలో ప్రయాణాలకు వీలైనంత వరకు మెట్రోను ఆశ్రయించడం, సొంత వాహనాల వాడకాన్ని తగ్గించడం ద్వారా ఈ ఇంధన కొరత సంక్షోభాన్ని అధిగమించవచ్చు.

Tags:    

Similar News