Stock Market Today: స్టాక్ మార్కెట్లలో మరో బ్లాక్ ఫ్రైడే
Stock Market Today: స్టాక్ మార్కెట్‌లను మరో బ్లాక్ ఫ్రైడే నిరాశపరిచింది. వరుసగా ఆరోరోజు సూచీలు నష్టాల బాట పట్టాయి.
Stock Market Today: స్టాక్ మార్కెట్‌లను మరో బ్లాక్ ఫ్రైడే నిరాశపరిచింది. వరుసగా ఆరోరోజు సూచీలు నష్టాల బాట పట్టాయి. ఇవాళ సెన్సెక్స్ 700 పాయింట్లు పతనం అవగా.. నిఫ్టీ 236 పాయింట్లు కోల్పోయింది. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఔషధాలపై సుంకాల పేరుతో మరో బాంబ్ పేల్చడంతో ఆరోరోజు సూచీలు నష్టపోయాయి. దాంతో ఫార్మా షేర్లు పతనం అయ్యాయి. అటు ఐటీ షేర్లు కూడా నష్టపోయాయి. ఉదయం 80 వేల 956 పాయింట్ల దగ్గర ప్రారంభమైన సెన్సెక్స్.. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. చివరకు 733 పాయింట్ల నష్టంతో 80 వేల 426 పాయింట్లతో ముగిసింది. నిఫ్టీ 236 పాయింట్లు కోల్పోయి 24వేల 654 పాయింట్ల దగ్గర ముగిసింది.