SEBI Mutual Fund Rules: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు SEBI గుడ్ న్యూస్.. ఇక ఈక్విటీ ఫండ్లతోనే 'బంగారం, వెండి'!

SEBI Mutual Fund Rules: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు SEBI గుడ్ న్యూస్.. ఇక ఈక్విటీ ఫండ్లతోనే 'బంగారం, వెండి'!

Update: 2026-03-09 15:21 GMT

SEBI Mutual Fund Rules

SEBI Mutual Fund Rules: SEBI (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు గుడ్ న్యూ్స్ చెప్పింది. స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకుని పెట్టుబడిదారులకు స్థిరమైన రాబడిని అందించేందుకు SEBI కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఇకపై మీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల డబ్బు కేవలం షేర్లకే పరిమితం కాకుండా, బంగారం, వెండిలోకి కూడా మళ్లబోతోంది. దీని ప్రకారం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు ఇకపై తమ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని విలువైన లోహాలైన బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ మార్పు పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఏమిటీ ఈ కొత్త నిబంధన..

సాధారణంగా ఈక్విటీ ఫండ్లు తమ నిధులను కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన కొద్దిపాటి నగదును డెట్ ఇన్స్ట్రుమెంట్లలో ఉంచుతాయి. అయితే ఈ కొత్త రూల్ ప్రకారం.. ఈక్విటీ ఫండ్‌లు తమ ప్రధాన అవసరాలు తీరిన తర్వాత, మిగిలిన నిధులలో 35% వరకు బంగారం, వెండి లేదా మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్టుల (InvITs) లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది ఫండ్ మేనేజర్లకు మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు తమ పోర్ట్‌ఫోలియోను రక్షించుకోవడానికి ఒక "రక్షణ కవచం" (Hedge) లా పనిచేస్తుంది.

ఇన్వెస్టర్లకు కలిగే లాభాలేంటంటే..

స్టాక్ మార్కెట్ పడిపోతున్నప్పుడు సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. దీనివల్ల ఈక్విటీ ఫండ్ల పతనం కొంతవరకు అదుపులో ఉంటుంది. కేవలం రక్షణ కోసమే కాకుండా, ఎలక్ట్రానిక్స్, సోలార్ రంగాల్లో వెండికి ఉన్న భారీ డిమాండ్ వల్ల అదనపు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఫండ్ మేనేజర్లు మార్కెట్ చాలా ఖరీదైనదిగా ఉన్నప్పుడు తెలివిగా ఈ లోహాలలో పెట్టుబడి పెట్టి పోర్ట్‌ఫోలియోను స్థిరంగా ఉంచుతారు.

గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

బంగారం, వెండి చేరడం మంచిదే అయినా, కొన్ని అంశాల్లో జాగ్రత్త అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు ఇప్పటికే గోల్డ్ బాండ్లు (SGBs) లేదా గోల్డ్ ETFలలో పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పుడు మీ ఈక్విటీ ఫండ్ కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటా నిర్దేశించిన దానికంటే ఎక్కువ అయిపోయే ప్రమాదం ఉంది. వాస్తవానికి లోహాల ధరలు భౌగోళిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, జనవరి 2026లో గోల్డ్ ETFలు 10%, వెండి ETFలు 24% వరకు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీ మొత్తం పెట్టుబడిలో బంగారం వాటా మించకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ ఆర్టికల్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. దీనిని పెట్టుబడి సలహాగా భావించకూడదు.

Tags:    

Similar News