Gautam Adani: మహిళా దినోత్సవాన ఆ మహిళల వల్లే ఇదంతా.. అంటూ గౌతమ్ అదానీ భావోద్వేగం..

Gautam Adani: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌతమ్ అదానీ సోషల్ మీడియాలో తనను ప్రభావితం చేసిన మహిళల గురించి వివరించారు.

Update: 2026-03-09 07:47 GMT

Gautam Adani: మహిళా దినోత్సవాన ఆ మహిళల వల్లే ఇదంతా.. అంటూ గౌతమ్ అదానీ భావోద్వేగం..

Gautam Adani: మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం (మార్చి8న) దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు మహిళా శక్తి గురించి.. తమకు స్ఫూర్తిగా నిలిచిన మహిళామణుల గురించి వివరించారు. అంతేకాకుండా చాలామంది ప్రముఖులు మహిళలపై తమకున్న గౌరవాన్ని చాటి చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తన లింక్డ్ ఇన్ లో మహిళల గురించి చాలా ఉన్నమైన సందేశాన్నిచ్చారు. తన జీవితంలో తనకు స్ఫూర్తినిచ్చిన తన తల్లి గురించి, తనకు తోడుగా నిలిచిన తన జీవిత సహచరి గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.

తల్లి పిల్లల కు మొదటి గురువు. గౌతమ్ అదానీ కూడా తన మొదటి గురువు తన తల్లే అని చెప్పారు. తాను ఎంత ఎత్తు ఎదిగినా ఇప్పటికీ తన తల్లి తనకు చిన్నతనంలో నేర్పిన ప్రతి విషయానికి సంబంధించిన ప్రభావమూ చెక్కు చెదరకుండా తనపై ఉందని అదానీ అన్నారు. తాను చిన్నప్పటి నుంచి తల్లి చెప్పిన పౌరాణిక గాధలు వింటూ పెరిగానన్నారు. ఆ కథల్లోని ప్రతి అంశమూ తాను పాఠ్యపుస్తకాల్లో నేర్చుకున్న వాటికంటే విలువయినవని చెప్పారు. తన తల్లి ఇల్లు వదిలి ముంబైకి వెళ్లి, సొంతంగా ఏదైనా సాధించాలనే దృఢ సంకల్పంతో, తన 16 సంవత్సరాల వయసులో కొడుకును అనిశ్చిత భవిష్యత్తు ఉన్న ప్రపంచంలోకి పంపించే ధైర్యం చేసిందని.. అదే తనను ఇంత వాడిగా నిలబెట్టింది చెబుతూ తల్లిని గుర్తు చేసుకున్నారు.

ఇక తన భార్య ప్రీతీ అదానీ గురించి ఆయన అద్భుతమైన పదాలతో వివరించారు. ఆమె ‘నా మనస్సాక్షి కీపర్’ అంటూ అభివర్ణించిన ఆయన తన భార్య వ్యక్తిత్వాన్ని వివరించారు. స్వతహాగా డెంటిస్ట్ అయినా ప్రీతీ అదానీ తమ అదానీ ఫౌండేషన్ ద్వారా 22 రాష్ట్రాల్లో కోటికి పైగా ప్రజల జీవితాలను ప్రీతి మార్చారన్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా తన ఇద్దరు కోడళ్ల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. తన కోడళ్ళు పరిధి, దివా తమ కుటంబానికి కొత్త దృక్పథాల్ని, విజయాల్ని తీసుకు వచ్చారని ప్రశంసించారు. వీరు దివ్యాంగుల కోసం దేశవ్యాప్తంగా సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

వీరే కాకుండా తన మనవరాళ్లు గురించి కూడా చెప్పిన ఆయన.. ఇంటిలో ఆడపిల్లలు ఉంటె మన పని ఒత్తిడిని తగ్గించేస్తారని వెల్లడించారు. “జీవితానికి బలమైన పునాదిని ఏ ఉక్కుతోనో లేదా కాంక్రీటుతోనో వేయలేము. మనల్ని తీర్చిదిద్దే వ్యక్తులే ఈ పునాదిని నిర్మిస్తారు. ప్రపంచం నా ప్రయాణాన్ని గుర్తుంచుకుంటే, ఇదిగో ఇదే కావాలని నేను ఆశిస్తున్నాను” అని చెప్పిన ఆయన మహిళా దినోత్సవం సందర్భంగా మనం రూపొందిస్తున్న ప్రపంచం ఈ దేశంలో పెరిగే ప్రతి బిడ్డకు అర్హమైనదిగా ఉండాలి. అంటూ ఆకాంక్షించారు.


https://www.linkedin.com/pulse/women-architects-my-conscience-gautam-adani-uxjlf

Tags:    

Similar News