Indian Railway: రైల్వే ప్ర‌యాణికుల‌కు గ‌మ‌నిక‌.. న‌వంబ‌ర్ 1 నుంచి మార‌నున్న నిబంధ‌న‌లు

Indian Railway: భారతీయ రైల్వే.. ప్రయాణికుల కోసం కీలక మార్పులు తీసుకురానుంది. 2025, నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.

Update: 2025-05-02 14:00 GMT

Indian Railway: రైల్వే ప్ర‌యాణికుల‌కు గ‌మ‌నిక‌.. న‌వంబ‌ర్ 1 నుంచి మార‌నున్న నిబంధ‌న‌లు

Indian Railway: భారతీయ రైల్వే.. ప్రయాణికుల కోసం కీలక మార్పులు తీసుకురానుంది. 2025, నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఇకపై వెయిటింగ్ టిక్కెట్ ఉన్నవారు ఏసీ లేదా స్లీపర్ కోచ్‌లలో ప్రయాణించే అవకాశం ఉండదు. వారు జనరల్ కోచ్‌లో మాత్రమే ప్రయాణించాలి.

ఇప్పటివరకు ఎలా ఉందంటే…

ఇంతకాలం వెయిటింగ్ టిక్కెట్లతో ప్రయాణికులు ఏసీ, స్లీపర్ కోచ్‌లలో ప్రయాణిస్తూ కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారికి ఇబ్బందులు కలిగించేవారు. ఈ క్ర‌మంలో గొడ‌వలు కూడా జ‌రిగిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయితే ఇక‌పై వెయిటింగ్ టిక్కెట్లు ఇకపై రిజర్వ్‌డ్ కోచ్‌లకు చెల్లుబాటు కాదు. వెయిటింగ్ టిక్కెట్ కలిగినవారు జనరల్ కోచ్‌లలో మాత్రమే ప్రయాణించాలి.

ఎవరైనా ఈ నియమాలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధిస్తారు. ఏసీ కోచ్‌లో వెయిటింగ్ టికెట్‌తో ప్రయాణిస్తే – రూ.440 జరిమానా విధిస్తారు. స్లీపర్ కోచ్‌లో అయితే రూ.250 జరిమానా చెల్లించాలి. టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే అదనంగా చార్జీలు పడతాయి. ఈ మార్పుల వ‌ల్ల ప్రయాణం సురక్షితంగా మార‌నుంది. రద్దీ సమయంలో అసౌకర్యం తగ్గుతుంది. కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారికి మంచి సౌక‌ర్యం ల‌భిస్తుంది.

Tags:    

Similar News