Indian Railways: అదే టిక్కెట్‌పై రెండు రోజుల తర్వాత ప్రయాణం.. రూట్ బ్రేక్ జర్నీ స్పెషల్ ఏంటో తెలుసా?

Break Journey Ticket Rules: భారతీయ రైల్వేలు సుదూర ప్రయాణానికి అనుకూలమైనవి, ఆర్థికంగానూ జనాలకు అందుబాటులో ఉంటాయి. సాధారణ వాహనం కంటే ఇందులో ప్రయాణించడం చాలా సౌకర్యంగా ఉంటుంది.

Update: 2023-06-15 14:30 GMT

Indian Railways: అదే టిక్కెట్‌పై రెండు రోజుల తర్వాత ప్రయాణం.. రూట్ బ్రేక్ జర్నీ స్పెషల్ ఏంటో తెలుసా?

Indian Railway Break Journey Ticket Rule: భారతీయ రైల్వేలు సుదూర ప్రయాణానికి అనుకూలమైనవి, ఆర్థికంగానూ జనాలకు అందుబాటులో ఉంటాయి. సాధారణ వాహనం కంటే ఇందులో ప్రయాణించడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ పలు నిబంధనలను రూపొందించింది. అయితే, రైల్వే కొన్ని నియమాల గురించి కొందరికి అవగాహన ఉండదు.

కొన్ని కారణాల వల్ల సరైన సమయానికి రైలును అందుకోలేకపోవడం చాలాసార్లు చూస్తేనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితిలో మీరు తదుపరి 2 స్టాప్‌లకు వెళ్లి మీ రైలును పట్టుకునే సౌకర్యాన్ని రైల్వే మీకు అందిస్తుంది. దాంతో మీరు మీ ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. మీకు కావాలంటే, మీరు మీ ప్రయాణాన్ని విడతలుగా కూడా పూర్తి చేయవచ్చు.

చాలా సార్లు ప్రజలు సందర్శన కోసం బయటకు వెళ్తారు. దీని కోసం ప్రయాణికులు తమ టిక్కెట్లను ముందుగానే కొనుగోలు చేస్తుంటారు. కానీ, షడన్‌గా ప్లాన్ మారుతుంది. ఈ సందర్భంలో మీరు కొత్త టికెట్ తీసుకోవలసిన అవసరం లేదు. మీరు అదే టిక్కెట్‌పై మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. అయితే, ఈ సమయంలో మీరు మీ కోచ్‌ని మార్చవలసి ఉంటుంది.

ప్రయాణం కొనసాగించడం ఎలా..

మీ ప్రయాణాన్ని కొనసాగించడానికి, మీరు TT అంటే టిక్కెట్ కలెక్టర్‌తో మాట్లాడాలి. అతను తదుపరి టికెట్ సిద్ధం చేసి మీకు ఇస్తాడు. కొన్ని కారణాల వల్ల మీ రైలును అందుకోలేకపోతే.. మీరు దానిని 2 స్టేషన్ల తర్వాత అందుకోవచ్చు. అప్పటి వరకు TT మీ సీటును ఎవరికీ ఇవ్వడు.

రూట్ బ్రేక్ జర్నీ రూల్ అంటే ఏమిటి?

ఈ ప్రత్యేకమైన నియమం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మీరు 500 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణంలో ఉంటే, మీరు మధ్యలో విరామం తీసుకోవచ్చు. ప్రయాణం 1000 కిలోమీటర్లు అయితే, మీరు రెండు విరామాలు తీసుకోవచ్చు. మీరు రైలులో ప్రయాణించినప్పుడు, మీరు ఎక్కిన, దిగిన తేదీ నుంచి 2 రోజుల విరామం తీసుకోవచ్చు. అయితే దేశంలోని శతాబ్ది, జన శతాబ్ది, రాజధాని వంటి లగ్జరీ రైళ్లకు ఈ నిబంధన వర్తించదు.

Tags:    

Similar News