Auto Debit Facility: క్రెడిట్‌కార్డులో ఆటో డెబిట్ సౌకర్యాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి.. ఉపయోగాలు ఏంటి..?
Auto Debit Facility: ఈ రోజుల్లో అన్నిపనులు ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతున్నాయి.
Auto Debit Facility: క్రెడిట్‌కార్డులో ఆటో డెబిట్ సౌకర్యాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి.. ఉపయోగాలు ఏంటి..?
Auto Debit Facility: ఈ రోజుల్లో అన్నిపనులు ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతున్నాయి. వివిధ రకాల కార్డుల ద్వారా అన్ని చెల్లింపులు సులభంగా చేస్తున్నారు. అందులో ముఖ్యంగా క్రెడిట్ కార్డులు చాలా ఫేమస్ అయ్యాయి. మీరు కూడా క్రెడిట్ కార్డుని ఉపయోగించేవారైతే ఆటో డెబిట్ సదుపాయాన్ని యాక్టివేట్, డీయాక్టివేట్ చేయాలంటే ఇంట్లో కూర్చొని సులభంగా చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు ఆటో డెబిట్ వంటి ప్రయోజనాలను అందించే బ్యాంకులు దేశంలో చాలా ఉన్నాయి.
నెలరాగానే హోమ్‌లోన్, వెహికల్ లోన్, క్రెడిట్ కార్డ్ బిల్లులు, వివిధ రకాల చెల్లింపులు గడువుతేదీలోపు చెల్లించాలి. ఒకవేళ చెల్లించలేదంటే పెనాల్టీలు తప్పవు. ఈ విషయాలన్ని గుర్తుంచుకోవడం ఈ రోజుల్లో కొంచెం కష్టమైన పనే. అందుకే ఆటో డెబిట్ ఆప్షన్‌ని ఎంచుకుంటే అన్ని చెల్లింపులు సకాలంలో జరుగుతాయి. ఎటువంటి పెనాల్టీలు ఉండవు. అయితే ఇది ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం.
ఆటో డెబిట్ చెల్లింపు ప్రయోజనాలు
సమయాన్ని ఆదా చేస్తుంది: మీ ఖాతా ద్వారా పునరావృతమయ్యే క్రెడిట్ కార్డ్ చెల్లింపులు గడువుతేదీలోపు జరుగుతాయి. ప్రతి నెలా మీకు చాలా సమయం ఆదా అవుతుంది.
పెనాల్టీ రిలీఫ్: మీరు గడువు తేదీ తర్వాత చెల్లిస్తే చాలా మంది విక్రేతలు పెనాల్టీని వసూలు చేస్తారు. మీరు ఆటో డెబిట్ వల్ల పెనాల్టీ, వడ్డీ రెండింటిలోనూ డబ్బు ఆదా చేసుకోవచ్చు.
సౌకర్యం : ఈ సదుపాయం ఒక ఆధునిక సౌకర్యం. చాలా ప్లాట్‌ఫారమ్‌లకు వారంవారీ, నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక సభ్యత్వ రుసుములు అవసరమయ్యే నేటి ప్రపంచంలో ఇది అత్యంత అనుకూలమైన పద్ధతి అని చెప్పవచ్చు.
తక్కువ ప్రమాదం: మీ చెల్లింపును మరెవరూ దుర్వినియోగం చేయలేరు. బ్యాంక్ ఖాతా నుంచి ఆటో-డెబిట్ జరుగుతుంది కాబట్టి మూడో వ్యక్తి ప్రమేయం ఉండదు.
రెండు చెల్లింపు పద్ధతులను ఉపయోగించడం: మీరు ఈ సదుపాయంతో TAD లేదా MDA అనే రెండు చెల్లింపు పద్ధతులని ఉపయోగించవచ్చు. 'TAD', 'MDA' అనేవి మొత్తం బకాయి, కనిష్ట మొత్తాన్ని సూచిస్తాయి.
ఆటో డెబిట్ సౌకర్యాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి..?
ఎస్బీఐ కస్టమర్‌లు ఆటో డెబిట్ యాక్టివేషన్ ఫారమ్‌ను బ్యాంక్ వెబ్‌సైట్ www.sbicard.com నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానిని నింపిన తర్వాత సంబంధిత బ్యాంకర్ నుంచి ఫారమ్ క్రాస్-వాలిడేషన్ పొందాలి. భౌతిక కాపీని ఎస్బీఐ కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ PO బాక్స్ 28 GPO, న్యూఢిల్లీ – 110001కి మెయిల్ చేయాలి. ఈ విధంగా మీరు క్రెడిట్ కార్డ్ ఆటో డెబిట్ ఫీచర్‌ని యాక్టివేట్ చేసుకోవచ్చు.
క్రెడిట్ కార్డ్ ఆటో డెబిట్ సౌకర్యాన్ని ఎలా డియాక్టివేట్ చేయాలి..?
మీరు ముందుగా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ www.sbicard.com నుంచి ఆటో డెబిట్ డీయాక్టివేషన్ లెటర్‌ని డౌన్‌లోడ్ చేసి దాన్ని పూరించాలి. లేఖను కింది చిరునామాకు పంపాలి: SBI కార్డ్స్ & పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ PO బాక్స్ 28 GPO, న్యూఢిల్లీ – 110001కి మళ్లీ మెయిల్ చేయాలి. ఈ విధంగా మీరు క్రెడిట్ కార్డ్ ఆటో డెబిట్ ఫీచర్‌ను నిలిపివేయవచ్చు.