LPG Gas Facts: గ్యాస్ సిలిండర్ పేలితే ఎంత పరిహారం చెల్లిస్తారు.. క్లెయిమ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది..?
LPG Gas Facts: ఈ రోజుల్లో వంట చేయడానికి ప్రతి ఒక్కరూ గ్యాస్ సిలిండర్లను వాడుతున్నారు. పొల్యూషన్ తగ్గించడానికి ప్రభుత్వాలు కూడా గ్యాస్ సిలిండర్లను వాడటానికి ప్రోత్సహిస్తున్నాయి.
LPG Gas Facts: ఈ రోజుల్లో వంట చేయడానికి ప్రతి ఒక్కరూ గ్యాస్ సిలిండర్లను వాడుతున్నారు. పొల్యూషన్ తగ్గించడానికి ప్రభుత్వాలు కూడా గ్యాస్ సిలిండర్లను వాడటానికి ప్రోత్సహిస్తున్నాయి. అంతేకాకుండా సిలిండర్లకు సబ్సిడీ కూడా ప్రకటిస్తున్నాయి. చాలామంది రెండు నెలలకోసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తారు. తర్వాత సదరు కంపెనీ వ్యక్తులు వచ్చి గ్యాస్ నింపిన సిలిండర్ ఇంట్లో చేర్చి వెళ్లిపోతాడు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి చాలా విషయాలు కొంతమందికి మాత్రమే తెలుసు. గ్యాస్ సిలిండర్లకు ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే వంటగదిలో ఉంచిన సిలిండర్ మీకు లేదా మీ ఇంటికి ఏదైనా నష్టం కలిగిస్తే మీకు పరిహారం లభిస్తుంది. ఈ రోజు దాని గురించి తెలుసుకుందాం.
ఎన్ని లక్షల ఇన్సూరెన్స్?
గ్యాస్ సిలిండర్‌పై రూ.10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే గ్యాస్ సిలిండర్ పేలితే సదరు కంపెనీ రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అనేక గ్యాస్ సిలిండర్ పేలుళ్ల కేసులు నమోదవుతున్నాయి. చాలా సార్లు ప్రజలు చనిపోతారు చాలా మంది గాయపడుతారు. సిలిండర్ పేలుడు కారణంగా ఇల్లు కూడా దెబ్బతింటుంది. అయితే ఇలాంటి ప్రమాదాల తర్వాత నష్టపరిహారం క్లెయిమ్ చేసే వ్యక్తులు భారతదేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు.
ముందుగా ఈ పని చేయండి
సిలిండర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఎవరైనా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వెంటనే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. దీని ప్రీమియం గ్యాస్ ఏజెన్సీ ద్వారానే చెల్లిస్తారు. ఇన్సూరెన్స్ డబ్బులు పొందడానికి ముందుగా దాని లీక్ లేదా పగిలిపోవడం గురించి పోలీసులకు లేదా గ్యాస్ ఏజెన్సీకి తెలియజేయాలి. అనంతరం ఏజన్సీ వ్యక్తులు సంఘటనా స్థలానికి వచ్చి ప్రమాదం ఎలా జరిగిందో ఆరా తీస్తారు. తర్వాత ఒక నివేదిక తయారు చేస్తారు. దాని ఆధారంగా ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లిస్తారు. మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవుతున్నా లేదా దానిలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే వెంటనే ఏజెన్సీని సంప్రదించండి. ఇలా చేయడం వల్ల పెద్ద ప్రమాదాన్ని నివారించవచ్చు.