Study Abroad: విదేశాల్లో విద్యకు బ్యాంకులే కాదు ఇక్కడ కూడా లోన్లు దొరుకుతాయి..!
Study Abroad: విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులు ఎక్కువగా బ్యాంకు రుణాలపై ఆధారపడుతున్నారు.
Study Abroad: విదేశాల్లో విద్యకు బ్యాంకులే కాదు ఇక్కడ కూడా లోన్లు దొరుకుతాయి..!
Study Abroad: విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులు ఎక్కువగా బ్యాంకు రుణాలపై ఆధారపడుతున్నారు. బ్యాంకు రుణాలు కాకుండా ఇతర ప్రత్యామ్నాయ అవకాశాలు కూడా ఉన్నాయి. బ్యాంకులు రుణం ఇవ్వకపోతే కొన్ని సంస్థలు, విద్యాలయాలు అందించే గ్రాంట్లు, స్కాలర్ షిప్ లతో చదువుకోవచ్చు. బ్యాంకు రుణంతో పాటు ఇలాంటి ప్రత్యామ్నాయాలున్నాయో చూడాలి.
విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు, వసతి, ఇతర ఖర్చులు విదేశాల్లో ఎక్కువగానే ఉంటుంది. ఆయా దేశాన్ని బట్టి ఈ ఖర్చు పెరుగుతుంది. అమెరికా, రష్యా, అస్ట్రేలియా, కెనడాలలో అక్కడి పరిస్థితుల ఆధారంగా ఖర్చు ఉంటుంది. అమెరికా, యుకేలలో చదివే విద్యార్థులకు కొన్ని యూనివర్శిటీలు స్కాలర్ షిప్ లు,గ్రాంట్లు అందిస్తాయి. ఇండియా నుంచి ఎక్కువగా మాస్టర్స్ చేసేందుకు విద్యార్థులు అమెరికా, యుకే వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. యుకేలోని కొన్ని విశ్వవిద్యాలయాలు చెవెనింగ్ స్కాలర్ షిప్ ప్రోగ్రాంతో చదువుకునేందుకు ఆర్ధిక సాయం అందుతుంది.
మెరిట్, అకడమిక్ ఎక్సలెన్స్, టాలెంట్, స్పాన్సర్ చేసే సంస్థల ప్రమాణాలను అభ్యర్ధులు అందుకుంటే వారికి స్కాలర్ షిప్, గ్రాంట్లను అమెరికాలోని కొన్ని యూనివర్శిటీలు అందిస్తున్నాయి. అసాధారణ ప్రతిభ ఉంటేనే యుఎస్‌లోని యూనివర్శిటీలు స్కాలర్ షిప్ లేదా గ్రాంట్లను అందిస్తాయి.
ఇండియాతో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు అమెరికా లేదా యుకెలో మాస్టర్స్ కోసం వెళ్తే స్థానికంగా పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. ఈ జాబ్ ద్వారా తమ ఖర్చులకు అవసరమైన డబ్బులను సమకూర్చుకుంటారు. కొందరు విద్యార్థులు తమ టర్మ్ ఫీజులను కూడా ఇలా చెల్లిస్తారు. కొన్ని రాష్ట్రాలు విదేశాల్లో విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఈ పథకాలను అమలు చేస్తున్నాయి. ఇలానే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో పథకాలున్నాయి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటే విద్యార్థులకు ప్రభుత్వాలు విడతలవారీగా నిధులను అందిస్తాయి.
బ్యాంకుల ద్వారా పొందే రుణానికి ఆదాయ పన్ను కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. 30 శాతం ఆదాయ పన్ను చెల్లించే వాళ్లు ఎడ్యుకేషన్ లోన్ తీసుకొంటే మేలు. ఎడ్యుకేషన్ లోన్ 10 నుంచి 12 శాతం వడ్డీ ఉంటుంది.
బ్యాంకులతో పాటు లీప్ ఫైనాన్స్, ప్రాడిజీ, కుహు ఎడ్యుఫిన్ టెక్ వంటి సంస్థలు కూడా విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు రుణం అందిస్తాయి.కొన్ని సంస్థలు ఎలాంటి గ్యారంటీ లేకుండానే లోన్లు మంజూరు చేస్తున్నాయి.