Health insurance: ఒక ఏడాదిలో ఎన్నిసార్లు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చో తెలుసా ? కవరేజీ అయిపోతే ఏం చేయాలి ?
Health insurance: జబ్బు చిన్నదైనా పెద్దదైనా హాస్పిటల్ ఖర్చు మాత్రం చాలా పెద్దగానే ఉంటుంది. పేద, మధ్య తరగతి ప్రజలు ఈ ఖర్చును భరించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.
Health insurance: ఒక ఏడాదిలో ఎన్నిసార్లు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చో తెలుసా ? కవరేజీ అయిపోతే ఏం చేయాలి ?
Health insurance: జబ్బు చిన్నదైనా పెద్దదైనా హాస్పిటల్ ఖర్చు మాత్రం చాలా పెద్దగానే ఉంటుంది. పేద, మధ్య తరగతి ప్రజలు ఈ ఖర్చును భరించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అందుకే హెల్త్ ఇన్సురెన్స్ అనేది పేద, మధ్యతరగతి ప్రజలకు చాలా అవసరం. ఒక అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేదనే అనుకోండి. అప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి హాస్పిటల్‌లో చేరితే ఏం చేస్తారు? సేవింగ్స్ నుంచి తీసి ఖర్చుపెడతారు. లేదంటే అప్పులు చేసి హాస్పిటల్ బిల్ కడతారు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా అవసరం. అయితే పాలసీ తీసుకునే ముందు చాలా అనుమానాలు రావొచ్చు. ఇవి ఎలా పనిచేస్తాయి? కవరేజ్ అయిపోతే ఏం చేయాలి? అసలు పాలసీ తీసుకున్న తర్వాత ఆ పాలసీని మనం ఎన్నిసార్లు వాడుకోవచ్చు? ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
క్లెయిమ్ ఇలా చేసుకోవాలి..
ప్రతి పాలసీకి మ్యాగ్జిమమ్ కవరేజ్ అమౌంట్ ఉంటుంది. 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు.. ఇలా ఆ కవరేట్ అమౌంట్ పెరుగుతు ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇందులో ఒక అమౌంట్‌ని సెలెక్ట్ చేసుకున పాలసీ తీసుకున్నామో.. ఆ అమౌంట్ లోపల మనం పాలసీని క్లెయిమ్ చేసుకోవాలి. అయితే ఏడాదిలో ఒకసారి క్లయిమ్ చేసుకున్న తర్వాత మళ్లీ చేసుకోవచ్చా లేదా అనే అనుమానం మీకు వస్తే.. ఈ అమౌంట్ దాటనంతవరకు ఎన్ని సార్లైనా మీరు క్లయిమ్ చేసుకోవచ్చు. అంటే మీకు 2 లక్షల కవరేజ్ ఉంటే ఆ లిమిట్‌ని చేరుకునే వరకు హాస్పిటల్ బిల్లులు కోసం ఎన్నిసార్లు అయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఏడాదిలో మాత్రమే ఇది ఉపయోగపడుతుంది.
కవరేజ్ దాటినాక మరో బెనిఫిట్
ఒక్కోసారి పాలసీ కవరేజ్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే హాస్పిటల్ బిల్లులు ఎక్కువ రావొచ్చు. అలాంటప్పుడు మీరు తీసుకున్న పాలసీ కవరేజ్ లిమిట్ అయిపోతుంది. అలాంటప్పుడు మీకు రెస్టోరేషన్ బెనిఫిట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. అంటే మీ కవరేజ్ అమౌంట్ పూర్తిగా ఉపయోగించేస్తే దాన్ని రీఫిల్ చేసే ఫీచర్ అన్నమాట. ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. కవరేజ్ తక్కువ ఉంది అలాంటి సమయంలో ఈ రెస్టోరేషన్ ఫీచర్ మీ అమౌంట్ ను తిరిగి పెంచుతుంది. దీంతో ఇతర హాస్పిటల్ ఖర్చులకు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని ముందే పాలసీ తీసుకునే సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మీరు రెస్టోరేషన్ బెనిఫిట్‌తో పాలసీని తీసుకోవాలి.
పాలసీ ప్రకారమే క్లెయిమ్
క్లెయిమ్ ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు దీనికి లిమిట్ అనేది ఇన్సూరెన్స్ ని బట్టి ఉంటుంది. అలాగే పాలసీ రూల్స్ ని బట్టి ఉంటుంది. చాలా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు.. పాలసీలు తీసుకున్న తర్వాత 30 రోజులు వరకు పీరియడ్ ఇస్తాడు. ఈ పీరియడ్ దాటిన తర్వాత ఎవరైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఈ సమయంలో యాక్సిడెంటల్ కేసుల్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది కూడా పాలసీని బట్టి ఉంటుంది.
ఒక్క వ్యక్తి ఎన్ని పాలసీలు ఉండొచ్చు?
ఒక వ్యక్తి ఒక్క పాలసీకి మాత్రమే అర్హుడు కాదు. అతను ఎన్ని పాలసీలు అయినా తీసుకోవచ్చు. కంపెనీ నుంచి ఒకటి, పర్సనల్ నుంచి ఒకటి ఇలా రెండు పాలసీలు కూడా ఉండొచ్చు. ఈ రెండింటినీ ఏకకాలంలో ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ క్లెయిమ్ అవసరం పడుతుంది అనుకునేవాళ్లు ఇలా ఒకదాని తర్వాత మరొకటి ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే.. పాలసీదారుడు ఒకేసారి రెండు ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకే క్లెయిమ్‌ని ఫైల్ చేయలేడు. మొదట ఒక సంస్థ నుంచి క్లెయిమ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండోది చేయాలి. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే అన్ని వివరాలను రెండు కంపెనీలకు తెలియజేయాలి. అప్పుడే పాలసీని ఉపయోగించుకోగలుతాం.