ఏదైనా రుణానికి గ్యారెంటర్‌గా సంతకం చేశారా.. ఇవి తెలుసుకోపోతే చాలా నష్టపోతారు..!

Loan Guarantor: మీరు బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల రుణాలకి గ్యారంటర్‌గా సంతకం చేశారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

Update: 2022-11-24 03:07 GMT

ఏదైనా రుణానికి గ్యారెంటర్‌గా సంతకం చేశారా.. ఇవి తెలుసుకోపోతే చాలా నష్టపోతారు..!

Loan Guarantor: మీరు బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల రుణాలకి గ్యారంటర్‌గా సంతకం చేశారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. కొన్ని విషయాలలో జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే చాలా పెద్ద సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు కొంతమంది బ్యాంకు లేదా ఇతర ఫైనాన్స్‌ కంపెనీల నుంచి రుణం తీసుకుంటారు. వారికి రుణాలు మంజూరు చేసేటప్పుడు ఒక హామీదారుని కోరుతారు.

ఈ పరిస్థితిలో వారు బంధువులు లేదా పరిచయస్తులను హామీదారులను చేస్తారు. తర్వాత వీరు ఇబ్బందులని ఎదుర్కోవలసి ఉంటుంది. గ్యారెంటర్‌గా మారేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. హోమ్ లోన్, బిజినెస్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ మొదలైన ఏ రకమైన లోన్ అయినా ఇచ్చే ముందు బ్యాంక్ వ్యక్తి క్రెడిట్ స్కోర్‌ను చెక్‌ చేస్తుంది. ఒక వ్యక్తి క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకు అతనికి రుణం ఇవ్వడానికి నిరాకరిస్తుంది. లేదా రుణ హామీదారుని డిమాండ్ చేస్తుంది. ఈ పరిస్థితిలో గ్యారెంటర్‌ అవసరం పడుతుంది.

రుణం తీసుకున్న వ్యక్తి సకాలంలో చెల్లించకపోతే దానిని చెల్లించమని బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీలు గ్యారెంటర్‌ని ఇబ్బందిపెడుతాయి. దీనివల్ల గ్యారెంటర్‌ క్రెడిట్ స్కోర్‌ దెబ్బతింటుంది. గ్యారెంటర్ కూడా రుణాన్ని తిరిగి చెల్లించకపోతే బ్యాంకు హామీ పేరుతో నోటీసు జారీ చేస్తుంది. తర్వాత కూడా రుణగ్రహీత, గ్యారెంటర్‌ రుణాన్ని తిరిగి చెల్లించకపోతే వారిద్దరి CIBIL స్కోర్ క్షీణిస్తుంది. తరువాత ఇద్దరూ ఏదైనా బ్యాంకు నుంచి రుణం తీసుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది.

Tags:    

Similar News