GST Council Meeting: జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కు సర్వం సిద్ధం.. సామాన్యులకు అన్నీ శుభవార్తలే..!
GST Council Meeting: జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశానికి రాజస్థాన్‌లోని జైసల్మేర్ సిద్ధమైంది. డిసెంబర్ 20, 21 తేదీల్లో జైసల్మేర్‌లోని హోటల్ మారియట్‌లో జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం జరగనుంది.
GST Council Meeting: జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశానికి రాజస్థాన్‌లోని జైసల్మేర్ సిద్ధమైంది. డిసెంబర్ 20, 21 తేదీల్లో జైసల్మేర్‌లోని హోటల్ మారియట్‌లో జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman),ఇతర రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. వీరికోసం మిల్లెట్, రాగి వంటకాలపై దృష్టి పెట్టారు. ఇక్కడ జీడిపప్పు కట్లీ , జైసల్మేర్ పాపులర్ ఘోత్మ లడ్డు కూడా మిల్లెట్ నుండి తయారు చేశారు. జీఎస్టీ కౌన్సిల్ 55 వ సమావేశం కూడా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇందులో అనేక పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు, దీనిలో ఆరోగ్య బీమా, పన్ను స్లాబ్‌లు , 2025 సాధారణ బడ్జెట్‌పై సూచనలు ఇచ్చే ఛాన్స్ ఉంది. దీని ఆధారంగా దేశ సాధారణ బడ్జెట్ సిద్ధం అవుతుంది.
సమావేశానికి ఎవరు హాజరవుతారు
ఢిల్లీ సీఎం అతిషి, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, గోవా సీఎం ప్రమోద్ సావంత్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సహా పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దీంతో పాటు పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పాల్గొంటారు.
టర్మ్ జీవిత బీమాపై జీఎస్టీ మినహాయింపు
టర్మ్ జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని మినహాయించాలని మంత్రుల బృందం (GoM) సిఫార్సు చేసింది. ఇది బీమా తీసుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తుంది. సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు కూడా ప్రతిపాదించబడింది. దీనివల్ల వృద్ధులకు ఆరోగ్య బీమా మరింత అందుబాటులోకి వస్తుంది.
5 లక్షల వరకు ఆరోగ్య బీమాపై తగ్గింపు
5 లక్షల వరకు ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీని మినహాయించే అవకాశం ఉంది. అయితే, రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉన్న కవరేజీ పై ఇది వర్తించదు. ఈ సమావేశం ఆరోగ్య, జీవిత బీమాను ప్రోత్సహించడం, బీమా ప్లాన్‌లను అందుబాటులో ఉంచేలా చేయడం కోసం ఒక పెద్ద ముందడుగు వేయవచ్చు. అలాగే, ఈ ప్రతిపాదనలు భారతదేశ పన్ను వ్యవస్థను మరింత సరళంగా చేసేందుకు సహాయపడతాయి.
పన్ను శ్లాబ్‌లో మార్పుపై చర్చ
గత అనేక సాధారణ బడ్జెట్ల నుండి, దేశ ప్రజలు ఆదాయపు పన్ను శ్లాబులలో మార్పులను ఆశించారు. సాధారణ బడ్జెట్‌కు ముందు జరిగే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో ఆదాయపు పన్ను శ్లాబ్‌లలో మార్పులపై కూడా చర్చించవచ్చు.