Indian Railways: సీనియర్‌ సిటిజన్లకి అలర్ట్‌.. రైల్వే మళ్లీ ఆ సేవలు ప్రారంభించే అవకాశం..!

Indian Railways: రైళ్లలో ప్రయాణించే సీనియర్‌ సిటిజన్లకి ఇది గొప్పవార్తని చెప్పవచ్చు.

Update: 2023-03-15 13:30 GMT

Indian Railways: సీనియర్‌ సిటిజన్లకి అలర్ట్‌.. రైల్వే మళ్లీ ఆ సేవలు ప్రారంభించే అవకాశం..!

Indian Railways: రైళ్లలో ప్రయాణించే సీనియర్‌ సిటిజన్లకి ఇది గొప్పవార్తని చెప్పవచ్చు. గతంలో రైల్వే శాఖ అందించే టికెట్‌ సబ్సిడీపై కొత్త అప్‌డేట్‌ వచ్చింది. దీనిని మరోసారి పునరుద్దరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, 58 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు రైల్వే టిక్కెట్‌లపై భారీ తగ్గింపు ప్రయోజనాన్ని పొందేవారు. దీనిని మళ్లీ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సీనియర్‌ సిటిజన్లకి రైల్వే టికెట్లపై సబ్సిడీని కొనసాగించాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. భారతీయ జనతా పార్టీ ఎంపీ రాధా మోహన్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ విషయం గురించి మాట్లాడింది. ప్రస్తుతం కరోనా సమస్య తగ్గుముఖం పట్టింది కాబట్టి రైళ్లలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీని పునరుద్ధరించాలని రైల్వే మంత్రిత్వ శాఖను కోరింది. ఇది కనీసం స్లీపర్ క్లాస్, థర్డ్ ఎసి క్లాస్‌లో పరిగణించాలని కోరారు. తద్వారా బలహీనమైన పౌరులు ఈ సదుపాయాన్ని ఉపయోగించకుంటారని తెలిపారు.

2020 మార్చికి ముందు సీనియర్ సిటిజన్ల విషయంలో అన్ని తరగతుల్లో మహిళలకు 50 శాతం, పురుషులకు 40 శాతం తగ్గింపును ఇచ్చేవి. ఈ మినహాయింపు పొందడానికి వృద్ధ మహిళలకు కనీస వయోపరిమితి 58 సంవత్సరాలు, పురుషులకు 60 సంవత్సరాలుగా నిర్ణయించారు. కానీ కరోనా కాలం తరువాత వారికి ఇచ్చిన అన్ని రకాల రాయితీలు రద్దు చేశారు. అయితే డిసెంబర్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సీనియర్ సిటిజన్‌లకు ఇస్తున్న రాయితీలను మళ్లీ పునరుద్ధరించమని చెప్పారు.

Tags:    

Similar News