Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు నిన్నటితో పోలేస్తే ఈరోజు పది గ్రాములకు 250 రూపాయల మేర పెరిగాయి. వెండి ధరలు నిలకడగానే ఉన్నాయి.

Update: 2019-09-26 02:47 GMT

స్వల్ప పెరుగుదల తో బుధవారం కొద్దిగా నయమనిపించిన బంగారం గురువారం మాత్రం భారీ పెరుగుదల నమోదు చేసింది. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధర పది గ్రాములకు 250 రూపాయల మేర పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా 250 రూపాయలు పెరగడంతో 39,650 దగ్గర ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 250 రూపాయలు పెరిగి 36,370 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర ఈ రోజూ స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధర మార్పులు లేకుండా 50,071 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నం లలో కూడా ఇదే పరిస్థితి ఉంది.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు పెరిగి 38,350 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 250 రూపాయలు పెరిగి 37,150 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరలో మాత్రం మార్పు లేదు. కేజీ వెండి ధర 50,071 రూపాయలుగానే ఉంది.


Tags:    

Similar News