Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆల్ టైమ్ రికార్డ్.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. చరిత్రలో ఏనాడూ లేని విధంగా బంగారం ధర పెరుగుతోంది. నేడు జనవరి 26వ తేదీ ఆదివారం హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లు రూ. 75,589ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 82,459వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 1,08,400గా ఉంది. దేశంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఫెడ్ వడ్డీ రేట్ల కోత, ఆర్బిఐ వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం,వెండి ధరల హెచ్చుతగ్గుదలకు కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు గమనించినట్లయితే ఇప్పట్లో బంగారం ధరలు దిగివచ్చే ఛాన్స్ లేదని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టారిఫ్ విషయంలో ఎలా వ్యవహరిస్తారనే అంశంపై అనిశ్చిత కొనసాగుతోంది.
ఎన్నికల సమయంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపించే విధంగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇతర అంశాల్లోనూ ఎలా వ్యవహరిస్తారనే దానిపై స్పష్టత లేదు. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనగా బంగారంపై పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడి పాలసీ నిర్ణయాలు వెలవడే వరకు బంగారం ధరల తగ్గుదలపై ఓ అంచనాకు రాలేమని చెబుతున్నారు.