Gold Rate Today: మళ్లీ భగ్గుమంటున్న బంగారం ధరలు
Gold Rate Today: బంగారం ధర మళ్లీ భగ్గుమంటోంది.
Gold Rate Today: మళ్లీ భగ్గుమంటున్న బంగారం ధరలు
Gold Rate Today: బంగారం ధర మళ్లీ భగ్గుమంటోంది. వారం రోజుల నుంచి పసిడి రేటు క్రమేణ పెరుగుతూ వస్తోంది. వారం రోజుల్లోనే ఏకంగా వెయ్యి రూపాయల మేర బంగారం ధర పెరిగింది. దీంతో బంగారం కొనుగోలు దారులకు షాకింగ్‌గా మారింది. పండగ సీజన్‌లో చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. భారత కరెన్సీ రూపాయి రికార్డు కనిష్టానికి పతనమైంది. ఇవన్ని వెరసి బంగారంపై పడుతున్నాయి.
భారత్ తన బంగారం డిమాండ్‌లో చాలా వరకు దిగుమతుల ద్వారానే నెరవేర్చుకుంటోంది. రూపాయి వాల్యూ పతనమవుతూ ఉండటంతో బంగారం ఖరీదైనదిగా మారుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధరలు ఔన్స్ 1,700 డాలర్ల పైన ట్రేడవుతున్నాయి. సిల్వర్ రేట్లు కూడా అంతర్జాతీయ మార్కెట్లో పెరిగాయి. గత కొంత కాలంగా ఈ రేట్లు తీవ్ర ఒడుదుడుకులకు గురైన సంగతి తెలిసిందే. డాలర్ రేటు కాస్త శాంతించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఈ రేట్లు పెరుగుతున్నాయి.
పండగ సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనాలనుకుంటూ ఉంటారు. కానీ ఇదే అదునుగా కస్టమర్ల డిమాండ్‌తో రేట్లు కూడా వాచిపోతున్నాయి. ఈ వారం రోజుల నుంచి ప్రతి రోజూ ధరలు పెరుగుతున్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర అయితే హైదరాబాద్ మార్కెట్లో ఈ వారం ప్రారంభంలో అంటే అక్టోబర్ 3, 2022న 46వేల 850రూపాయలుగా ఉంటే.. ఈ రేటు ప్రస్తుతం 47వేల850రూపాయలకు పెరిగింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర కూడా 51వేల110 నుంచి 52వేల200రూపాయలకి ఎగిసింది. దీపావళి సందర‌్భంగా బంగారు నగలకు ధరలు పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.