Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Update: 2025-05-05 04:02 GMT

Gold Rate Today: నేడు మే 5వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాములు బంగారం ధర రూ.95,550 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87540 గా ఉంది. ఒక కేజీ వెండి ధర రూ.1,01,000 గా ఉంది. బంగారం ధరలు వారం రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న పరిస్థితులు కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ బలంగా ఉండటం వల్ల బంగారం ధరలు తగ్గుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా పసిడి ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికా మార్కెట్లలో పసిడి ధర ఒక ట్రాయ్ ఔన్స్ బంగారం ధర 3500 డాలర్ల నుంచి 3250 డాలర్లకు దిగివచ్చింది. దీంతో మన దేశంలో కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో బంగారం ధర ఒక లక్ష రూపాయల నుంచి 95 వేల రూపాయలకు దిగి వచ్చింది. బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో పసిడి అభరణాలు కొనుగోలు చేసేవారు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతోపాటు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు.

కానీ బంగారం కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ధర భారీగా పెరిగిన నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో ఒకటికి రెండుసార్లు పరీక్షించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. బంగారం పైన తప్పనిసరిగా హాల్ మార్క్ లేకుండా కొనుగోలు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా హాల్ మార్క్ లేని బంగారాన్ని నిషేధించింది.

బంగారం కొనుగోలు చేసే సమయంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ప్యూరిటీ. మీరు బంగారం కొనుగోలు చేసే సమయంలోనే కేడియం ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. 22 క్యారెట్ల బంగారంలో 91.6 ప్యూర్ గోల్డ్ ఉంటుంది. మిగతా మొత్తం ఇతర లోహాలు కలుస్తాయి. బంగారు ఆభరణాలు తయారు చేయించుకోవడానికి ఇది సరైన కాంబినేషన్. అప్పుడే నగలు మంచి మెరుపుతో కనిపిస్తాయి. క్వాలిటీ తగ్గే కొద్దీ బంగారం మెరుపు కూడా తగ్గుతుంది. ఇది గుర్తించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News