Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధరలు.. అదే దారిలో వెండి ధరలు!

Update: 2020-03-30 02:12 GMT

గత వారం అంతా పరుగులు తీసిన బంగారం ఈరోజు ఒక్కసారిగా కిందకు దిగివచ్చింది. వారం రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు (మార్చి,30) భారీగా తగ్గాయి.  పది గ్రాముల బంగారం దాదాపు 1900 రూపాయల వరకూ తగ్గుదలను నమోదు చేసింది. ఇక వెండి ధర కూడా భారీ తగ్గుదల వైపు నడిచింది. కేజీ వెండి 1900 రూపాయల మేర దిగివచ్చింది.

బంగారం ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. సోమవారం (30.03.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధర కంటే  1940 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,830 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 1925 రూపాయల తగ్గుదలతో 43,375 రూపాయలు నమోదు చేసింది.

భారీగా తగ్గిన వెండి ధరలు...

బంగారం ధరలు తగ్గితే అదేదారిలో  వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. వెండి ధర కేజీకి 1910 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 40 వేల మార్కు కంటే దిగువకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 39,500 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నం లలో..

ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 1940 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,830 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 1925 రూపాయల తగ్గుదలతో 43,375 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా తగ్గాయి. వెండి ధర 39,500 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1490 రూపాయల తగ్గుదలతో 43,710 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1150 రూపాయల తగ్గుదలతో 41,410 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా తగ్గాయి. 410 వేల మార్కు కంటే దిగువకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 39,500 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 30-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News