Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర ..తులం 99వేల పైకి.. ఒక్కరోజే 3000 పెరుగుదల

Update: 2025-05-27 01:44 GMT

Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర ..తులం 99వేల పైకి.. ఒక్కరోజే 3000 పెరుగుదల

Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ దడ పుట్టిస్తున్నాయి. ఆభరణాల వర్తకులు, రిటైలర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపిస్తుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర మళ్లీ రూ. 99వేల పైకి చేరుకుంది. గత శనివారంతో పోలిస్తే బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 99,300కు చేరుకుంది. గడిచిన వారంలో బంగారం ధర రూ. 3వేలకు పైగా పెరిగింది. అలాగే 99.5 శాతం స్వచ్చత కలిగిన బంగారం ధరరూ. 500 అధికమై రూ. 98,800 పలుకుతోంది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీగా పరుగులు పెట్టాయి.

పారిశ్రామిక వర్గాలతోపాటు నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో కిలో వెండి ఏకంగా రూ. 1,170 పెరిగింది. రూ. 1,00,370 పలుకుతోంది. అంతకుముందు ఇది రూ. 99,200గా ఉంది. ఈయూదేశాలపై విధించిన 50శాతం టారిఫ్స్ వాయిదా వేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుతున్నప్పటికీ దేశీయంగా పెరిగిందని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి తెలిపారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 24.83 డాలర్లు తగ్గి 3,332.59 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 

Tags:    

Similar News