Gold Rate Today: దిగొస్తున్న పుత్తడి..నేడు మే 21వ తేదీ బుధవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Update: 2025-05-21 01:33 GMT

Gold Rate Today: బంగారం ప్రియులకు అలర్ట్.. మళ్లీ షాకిచ్చిన పసిడి ధరలు..!!

Gold Rate Today: బంగారం ధరలు దిగివస్తున్నాయి. అధిక ధరల కారణంగా దేశీయంగా డిమాండ్ పడిపోవడంతో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అతివిలువైన లోహాల ధరలు దిగివస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 97వేల దిగువకు పడిపోయింది. బులియన్ మార్కెట్లో తులం ధర రూ. 490 తగ్గింది. దీంతో రూ. 96,540గా ఉంది. అంతకుముందు ఇది రూ. 97,030గా ఉందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది.

99.5 శాతం స్వచ్చత కలిగి బంగారం ధర కూడా అంతే తగ్గి రూ. 96,130గా నమోదు అయ్యింది. ప్రతీకార సుంకాల విధింపుపై అమెరికా చైనా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కిరానుండటం, రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కాల్పుల విరమణకు అంగీకరించే అవకాశాలు ఉండటం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. పసిడితోపాటు వెండి ధరలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. కిలో వెండి ధర రూ. 1000 తగ్గి రూ. 97,500కి దిగివచ్చింది. మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 3,233.68డాలర్ల దగ్గర ఉంది. 

Tags:    

Similar News