Gold Rate Today: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు..తలం రూ. 1లక్ష దిశగా పరుగులు

Update: 2025-01-17 00:12 GMT

 Gold Rate Today: బంగారం ధర గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతోంది. ప్రస్తతం బంగారం ధర దాదాపు 81వేలకు దగ్గరలో ఉంది. జనవరి 17వ తేదీ శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు సంతోషిస్తున్నప్పటికీ..ఆభరణాలు కొనుగోలు చేసేవారు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి పెరుగుతుండటంతో మహిళల్లో ఆందోళన నెలకొంది. తాజాగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధర భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా గోల్డ్ ధరలు గడిచిన వారం రోజులుగా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. మళ్లీ బంగారం రికార్డు స్థాయి దిశగా అడుగులు వస్తూంది. గతేడాది నవంబర్ నెలలో బంగారం ధర ఒక్కసారిగా 84వేల వద్ద ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకింది. అక్కడి నుంచి బంగారం ధర తగ్గుతూ వచ్చింది. అదే నెలలో దాదాపు 7వేల రూపాయల వరకు పతనం అయ్యింది. పసిడి ధర గడిచిన 10-15 రోజులుగా మళ్లీ పెరగడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బంగారం ధర ప్రస్తుతం 81వేలకు చేరుకుంటోంది. జనవరి 17 శుక్రవారం నాడు పది గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లు 80,860 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 74,500 దగ్గర ట్రేడ్ అవుతోంది. 

Tags:    

Similar News