Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్ ..తగ్గిన బంగారం ధరలు..మే 13 మంగళవారం ధరలు ఇవే
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..ఎంతంటే?
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. భారత్, పాకిస్తాన్ యుద్ధం ముందు వరకు బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే యుద్ధం రావడంతో మార్కెట్లో అనిశ్చితి ఏర్పడింది. దీంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి. లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అయిన స్వచ్చమైన బంగారం ఇప్పుడు భారీగా పడిపోయింది. 98వేల వద్ద ట్రేడ్ అవుతోంది. యుద్ధం ముగిసినా, కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ. 96,880 వద్ద ట్రేడ్ అయ్యింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 88800 వద్ద ట్రేడ్ అయ్యింది. ఇక పది గ్రాముల 18 క్యారెట్ల ధర 72660 వద్ద ట్రేడ్ అయ్యింది. ఈ రోజు 18,22,24 క్యారెట్ల పసిడి ధరపై 10 రూపాయలు తగ్గింది. పది గ్రాముల స్వచ్చమైన 24 క్యారెట్ల గోల్డ్ ధర ఈ రోజు 96,870 వద్ద ట్రేడ్ అవుతోంది. పది గ్రాముల 22క్యారెట్ల పసిడి ధర 88790 వద్ద ట్రేడ్ అవుతుండగా... 10 గ్రాము 18 క్యారెట్ల గోల్డ్ ధర 72650 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక బంగారం ధరల కంటే వెండి ధరలు నిలకడగా తగ్గుతున్నాయి. బంగారం పెరగడం, తగ్గడంతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతిరోజూ తగ్గుతూ వస్తున్నాయి. సోమవారం 100గ్రాముల వెండి ధర 10900 రూపాయల వద్ద ట్రేడ్ అయ్యింది. కేజీ వెండి ధర 1,09000దగ్గర ట్రేడ్ అయ్యింది. ఈ రోజు 100 గ్రాములపై 10 రూపాయలు, కేజీపై 100రూపాయలు తగ్గింది. ఈ రోజు 100 గ్రాముల వెండి ధర 10890 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో బంగారం ధర 1,08900 వద్ద ట్రేడ్ అవుతోంది.